సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. సరిలేరు నీకెవ్వరు సర్‌ప్రైజ్.. అనిల్ రావిపూడి చెప్పేశారు
Recommended Video
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో మంచి దూకుడుమీదున్నాడు. ఇటీవలే మహర్షి అనే సందేశాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తన 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌తో ట్విట్టర్ వేదికగా నెటిజన్లను పలకరించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇంతకీ ఆ అప్‌డేట్ ఏంటి? వివరాల్లోకి పోతే..

అదే బాట.. దానికి రెట్టింపు ఉండేలా
కామెడీ స్పెషలిస్ట్ అయిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవలే F2 రూపంలో ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్ అందించారు. ఇప్పుడు దానికి రెట్టింపు ఫన్ అందించేలా సూపర్ స్టార్ మహేష్ బాబును హీరోగా పెట్టి కామెడీ ఎంటర్టైనర్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' రూపొందిస్తున్నారు. దీంతో అనిల్ స్టైల్ కామెడీని మహేష్ అభినయిస్తే చూడాలని ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు.

ఇప్పటిదాకా వచ్చినవన్నీ..
ఓ వైపు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తోంది చిత్రయూనిట్. ఈ మేరకు ఇప్పటిదాకా వచ్చిన అప్‌డేట్స్ అన్నీ ప్రేక్షకుల్లో హోప్స్ పెంచేశాయి. దానికి కొనసాగింపుగా ఈ సారి దివాళీ స్పెషల్ ట్రీట్ అరేంజ్ చేశారట అనిల్ రావిపూడి. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు.

అనిల్ రావిపూడి సర్‌ప్రైజ్
''విలన్ హౌస్ షెడ్యూల్ పూర్తి చేశాం. 2020 సంక్రాంతి మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించనుంది. చివరి షెడ్యూల్‌కు రెడీ అవుతున్నాం. 'సరిలేరు నీకెవ్వరు' దివాళీ ట్రీట్‌కు సిద్ధంగా ఉండండి'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు అనిల్ రావిపూడి. ఓ కొత్త పోస్టర్ కూడా పోస్ట్ చేశారు. దీంతో సూపర్ స్టార్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం, ఆత్రుత నెలకొన్నాయి.
సంక్రాంతి రేస్.. బన్నీతో పోటా పోటీ
ఇక ఈ సారి సంక్రాంతి ప్రేక్షకులకు మరింత కనువిందు కానుంది. జనవరి నెలలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబు, అలా.. వైకుంఠపురంలో సినిమాతో అల్లు అర్జున్ పోటీ పడబోతున్నారు. ఈ రెండు సినిమాలు జనవరి 12నే విడుదల కానుండటం ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఎవరు గెలుస్తారా? అనే క్యూరియాసిటీ బాగా పెరిగింది.

సరిలేరు నీకెవ్వరు.. విజయశాంతి
అనిల్ రావిపూడి రూపొందిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. దీంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మరోసారి మహేష్ బాబు కామెడీ ఎపిసోడ్ చూడాలని ఆతృతగా ఉంది ప్రేక్షకలోకం.


Click it and Unblock the Notifications











