twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు ఆడియెన్స్ కు గుడ్ న్యూస్.. రాబోయే సినిమాలకు కొత్త టికెట్ల రేట్లు!

    |

    సినిమాలో థియేటర్లోకి వస్తున్నాయంటే నిర్మాతల్లో కొంత భయం అయితే ఎక్కువగా పెరిగిపోయింది. ఎందుకంటే ఆడియన్స్ ఎలాంటి సినిమాలు ఇష్టపడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అంతేకాకుండా టికెట్ల రేట్లు కూడా పెరిగిపోతున్నాయని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ మరొకవైపు నిర్మాతలు మాత్రం ఫస్ట్ వీకెండ్ లోనే టాక్ తో సంబంధం లేకుండా పెట్టిన పెట్టుబడిని వెనక్కి వచ్చేలా చేయాలి అని టికెట్ల రేట్లు పెంచాల్సి వచ్చింది. ఎందుకంటే సోమవారం దాటితే సినిమా కలెక్షన్స్ చాలా వరకు తగ్గిపోతున్నాయి.

    ఇక కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా కూడా వీకెండ్స్ లో కూడా సినిమాలో కలెక్షన్స్ రావడం లేదు. అయితే యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలకు మాత్రం కొంత అత్యధిక రెట్లు ఉండడంతో ఆడియన్స్ భయపడుతున్నారు. మధ్యతరగతి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కలిసికట్టుగా సినిమాలకు రావడం మానేశారు అనేది ప్రస్తుతం నిర్మాతల్లో ఎక్కువగా ఆందోళన కలిగిస్తోంది.

    Good news for Tollywood audience new cinema ticket rates

    ఈ క్రమంలో రీసెంట్గా నిర్వహించిన మీటింగ్లో నిర్మాతల మండలి టికెట్ల రేట్లపై ఒక నిర్ణయానికి వచ్చారు. రాబోయే సినిమాలకు కొత్త రేట్లల్లో టికెట్లు అందుబాటులోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 22వ తేదీన దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి థాంక్యూ సినిమా రాబోతోంది. ఇక ఆ తర్వాత రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా విడుదల కానుంది. కాబట్టి ఈ సినిమాలకు రెండు విభాగాల్లో టికెట్లు రేట్లు ఫిక్స్ అయితే చేశారు.

    అందరికి అందుబాటులో ఉండాలని మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలు టికెట్లను అలాగే సింగిల్ స్క్రీన్ లలో 100 రూపాయల టికెట్ రేట్లు నిర్ణయించారు. ఇక కేటగిరిని బట్టి అంతకంటే తక్కువ రేట్లు కూడా ఉంటాయి. అలాగే మరొకవైపు ఓటీటీ లో విడుదలయ్యే సినిమాల విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి విడుదలయ్యే ఏ సినిమా అయినా సరే 10 వారాలు థియేటర్లో ఉన్న తర్వాతనే ఓటీటీ విడుదల చేసే విధంగా ఒక రూల్ అయితే తీసుకురాబోతున్నారు. మరి ఈ ప్లాన్ సినిమా పరిశ్రమకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.

    English summary
    Good news for Tollywood audience new cinema ticket rates,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X