F 3: సినిమా టికెట్ల రేట్లపై గుడ్ న్యూస్.. కామెడీ స్టైల్ లో ఫుల్ క్లారిటీ ఇచ్చారుగా..

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా సినిమా టిక్కెట్ల రేట్లపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మధ్యతరగతి వారు భయపడే విధంగా టికెట్ల రేట్లు ఉండడంతో చాలా వరకు కొన్ని సినిమాలకు ఊహించని విధంగా నష్టాలు ఎదురయ్యాయి. అనవసరంగా టికెట్ల రేట్లు పెంచి ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా థియేటర్లకు దూరం చేస్తున్నారు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఇటీవల వచ్చిన కొన్ని పెద్ద సినిమాలపై కూడా ఆ ప్రభావం చూపించింది. ఆచార్య సినిమా దారుణంగా నష్టాలను ఎదుర్కోవడానికి కూడా సినిమా టికెట్ల రేట్లు అధికంగా ఉండడం మరొక ముఖ్యకారణం.

అంతేకాకుండా సర్కారు వారి పాట సినిమా కలెక్షన్స్ కూడా మెల్లగా తగ్గిపోతుండటంతో ఇటీవల మళ్లీ ఆ సినిమా టికెట్లు తగ్గించాల్సి వచ్చింది. మొత్తానికి ప్రభుత్వం అందించిన పాత రేట్లకు తగ్గట్టుగానే కొనసాగించారు. అయితే F3 సినిమాకు కూడా ఆ ప్రభావం పడుతుంది అని చిత్ర నిర్మాణ సంస్థ సరికొత్త ఆలోచన చేసింది. సినిమా టికెట్ల విషయంలో వారి స్టైల్ లో ఇచ్చిన క్లారిటీ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సినిమా ప్రమోషన్ లో దర్శకుడు అనిల్ రావిపూడి ఏవిధంగా ఆలోచిస్తాడో మరొకసారి చాలా క్లారిటీ గా అర్థమైంది.

Good news on F 3 movie ticket rates comedy video viral

నిర్మాత దిల్ రాజు అనిల్ రావిపూడి వారి తదుపరి సినిమాపై చర్చ జరుగుతూ ఉండగా హఠాత్తుగా వచ్చిన మరొక నటి వెంటనే సినిమా బిజినెస్ గురించి మొదట మాట్లాడుతుంది. అయితే ఏ ఏరియాల బిజినెస్ కూడా మా దగ్గర లేవు అని చెప్పడంతో ఆమె వెంటనే సినిమా టిక్కెట్ల రేట్లపై ప్రశ్నిస్తుంది. అనవసరంగా టికెట్ల రేట్లు పెంచకూడదు అని కామెడీగా అడగడంతో అందుకు నిర్మాత దిల్ రాజు ప్రభుత్వం ఇచ్చిన రేట్లకు తగ్గట్టుగా అవే రేట్లల్లో ఉంటాయి అని వివరణ ఇచ్చారు. అంతే కాకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమాలు చూడవచ్చు అని కూడా అన్నారు.

చూస్తుంటే నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ ఆడియెన్స్ ను గట్టిగానే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు ఈ ప్రత్యేకమైన వీడియో తో జనాలను బాగానే ఆకర్షించాడు. ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ వీడియోలో మరోసారి అనిల్ టాలెంట్ రుజువు అయింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాపై అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా ఓ వర్గం వారికి బాగా నచ్చేసింది. విడుదలైన టీజర్ కూడా బాగానే ఆకట్టుకుంది. కాబట్టి తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఈ సినిమాను మే 27వ తేదీన విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X