Just In
- 5 hrs ago
పవన్ కల్యాణ్‌తో సమంత అక్కినేని.. ఆ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది అందుకేనా?
- 6 hrs ago
ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డ శ్రియ.. లండన్‌లో పోలీసుల తూటా తప్పించుకొని!
- 7 hrs ago
రామ్ చరణ్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. ఆ ఫ్యాన్‌కు అంకితమిచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు
- 7 hrs ago
సెక్స్ అంటే చాలా ఇష్టం.. నాకు నచ్చిన వాళ్లతో తిరుగుతాను: యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
Don't Miss!
- News
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ... ప్రధాని మోడికి 600 మంది మేధావుల లేఖ
- Sports
బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్ ఆడింది.. గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా: రవిశాస్త్రి
- Finance
పెరిగిన టారిఫ్‌లు.. మరి ఇప్పుడైనా టెలికాం షేర్లు కొనవచ్చా?
- Lifestyle
బురదలో రొమాన్స్ : ఈ ఫొటో షూట్ ను చూసి తట్టుకోవడం కష్టం.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేయనున్న నాగార్జున
పేరుకు సీనియర్ హీరోనే అయినా అందంలో కుర్రాళ్లతో పోటీ పడుతున్నాడు అక్కినేని నాగార్జున. కేవలం ఆ విషయంలోనే కాదు.. సినిమాలు చేయడంలోనూ.. వ్యాపార ప్రకటనలు.. టీవీ షోలు ఇలా అన్నింటిలోనూ ఆయన టాలీవుడ్ హీరోలు అందరికంటే ముందే ఉన్నాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. అలాగే, బుల్లితెరపైనా కొన్ని షోలతో మెప్పిస్తున్నాడు. ఇటీవలే బిగ్ బాస్ షోను పూర్తి చేసుకున్న నాగ్.. త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నాడట. ఇంతకీ ఏంటా ప్రకటన..? వివరాల్లోకి వెళితే...

మన్మథుడిగా వచ్చి నిరాశ పరిచాడు
అక్కినేని నాగార్జున.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2' అనే సినిమా చేశాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో నాగ్ కెరీర్‌లోనే ఓ డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. ఇందులో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమా అక్కినేని అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిందనే చెప్పాలి.

బిగ్ బాస్ షోతో ఊరటనిచ్చాడు
నాగార్జున సినిమాతో తన అభిమానులను నిరాశ పరిచినప్పటికీ, ‘బిగ్ బాస్' షోతో మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌కు హోస్టింగ్ బాధ్యతలు నిర్వహించిన నాగ్.. టీఆర్పీ రికార్డులను సైతం బద్దలు కొట్టేశాడు. ఫలితంగా సినిమా ఫలితంతో నిరాశ చెందిన అభిమానులకు ఊరటను కలిగించాడు. ఈ షోలో నాగ్ బాడీ లాంగ్వేజ్ కూడా అందరిని మెప్పించిందనే చెప్పాలి.

సినిమా విషయంలో జాగ్రత్తలు
‘మన్మథుడు 2' సినిమా డిజాస్టర్‌గా మిగలడంతో నాగార్జున తన తదుపరి చిత్రాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కొద్ది సంవత్సరాలుగా సరైన హిట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కినేని అందగాడు.. ఈ సారి ఎలాగైన సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం కథల ఎంపిక సరిగా ఉండాలనుకుంటున్నారట.

కొత్తగా వెళ్లాలని నిర్ణయం
ఇప్పటి వరకు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన నాగార్జున.. ఇకపై సరికొత్తగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కథలో వైవిధ్యం చూపించాలన్న ఉద్దేశ్యంతోనే ఇప్పటి వరకు సినిమాను ఓకే చేయలేదని ఫిలిం నగర్‌లో ఓ టాక్ వినిపిస్తోంది. ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి కూడా ఆయన సిద్ధం అవుతున్నట్లు వినికిడి.

త్వరలోనే గుడ్ న్యూస్
అక్కినేని అభిమానులకు నాగార్జున త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారట. అది మరేంటో కాదు.. తన కొత్త సినిమా ప్రకటన గురించి. అవును.. నాగ్ కొద్ది రోజుల్లో తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేయనున్నాడని సమాచారం. దీని ద్వారా సాల్మాన్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడట. అతడు గతంలో ‘ఊపిరి' సినిమాకు రైటర్‌గా పని చేశాడు.