Bro The Avatar గుజరాత్‌లో బ్రో మూవీ సంచలనం.. వంగవీటి రంగా, పవన్ ప్లకార్టుల కలకలం
తమిళంలో భారీ సక్సెస్ సాధించిన వినోదయ సీతమ్ సినిమా ఆధారంగా రూపొందిన బ్రో ది అవతార్ సినిమా రికార్డు ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్నది. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్, సాధారణ ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రిపోర్టు వస్తున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, గుజరాత్‌లో బ్రో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. బ్రో ది అవతార్ సినిమా గురించిన వివరాలు, తెలుగేతర ప్రాంతాల్లో ఈ సినిమా సొంతం చేసుకొన్న స్పందన వివరాల్లోకి వెళితే..
బ్రో ది అవతార్ సినిమా విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన లభిస్తున్నది. నైజాంలో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఏపీ విషయానికి వస్తే.. ఆంధ్రాలో మినహాయిస్తే.. సీడెడ్ ప్రాంతాలు, నెల్లూరు, రాయలసీమలో ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

బ్రో సినిమాకు దేశవ్యాప్తంగా తెలుగు వారున్న ప్రాంతాల్లో మంచి స్పందన లభిస్తున్నది. ఢిల్లీలోని పటేల్ నగర్‌లో బ్రో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌కు అభిమానులు వెల్లువెత్తారు. థియేటర్‌లో హంగామాకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.

ఇక ఏపీ, తెలంగాణలోనే కాకుండా గుజరాత్‌లో పవన్ కల్యాణ్ అభిమానులు హల్‌చల్ చేశారు. గుజరాత్‌లోని ఓ థియేటర్ కిక్కిరిసిన ప్రేక్షకులతో కనిపించింది. మల్టీప్లెక్స్‌లో పవన్ కల్యాణ్, వంగవీటి రంగా ప్లకార్డులను ప్రదర్శించారు. పవన్‌తోపాటు రంగా ఫోటోలను ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.
అయితే గుజరాత్‌లోని థియేటర్‌లో వంగవీటి రంగా, పవన్ కల్యాణ్ ప్లకార్డుల ప్రదర్శిస్తూ ఆంధ్రా సీఎం పవన్ కల్యాణ్ అంటూ నినాదాలు చేశారు. రంగా అమర్ రహే అంటూ నినాదాలు చేయడం ఆసక్తికరమైన పరిణామంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











