KGF 2లో మన బాలయ్య.. ఇలా షాక్ ఇస్తే ఎలా తల్లి?

కన్నడ సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన సినిమా KGF చాప్టర్ 1. అసలు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక శాండీల్ వూడ్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది. అయితే ఇటీవల KGF చాప్టర్ 2లో సినిమాలో ఒక ప్రముఖమైన పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నట్లు ఒక షాకింగ్ ప్రూఫ్ బయటకు వచ్చింది. నిజం ఏమిటనేది అందరికి తెలిసినా కూడా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

KGF చాప్టర్ 2లోనే అసలైన కిక్కు

KGF చాప్టర్ 2లోనే అసలైన కిక్కు

యష్ నటించిన KGF చాప్టర్1 సినిమాకు కొనసాగింపుగా వస్తున్న చాప్టర్ 2పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాలో మొదటి చాప్టర్ కంటే రెండవ బాగంలోనే కిక్కిచ్చే ట్విస్టులు భారీగా ఉన్నాయని అలాగే యాక్షన్ డోస్ కూడా ఊహించని విధంగా ఉంటుందని అన్నారు.

గతంలో ఎప్పుడు లేని విధంగా

గతంలో ఎప్పుడు లేని విధంగా

మొత్తానికి రెండవ పార్ట్ పై అయితే దేశవ్యాప్తంగా అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తోడు సినిమాలో నటీనటుల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. ప్రకాష్ రాజ్ తో పాటు బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ మెయిన్ విలన్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కన్నడ సినిమా కోసం బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాలకృష్ణ కూడా ఉన్నాడా?

బాలకృష్ణ కూడా ఉన్నాడా?

ఇక ఆ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన పాత్రలో తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ కూడా నటిస్తున్నట్లు ఒక ఆధారం ఉండడం అందరిని ఆశ్చర్యపరిచింది. అందులో వాస్తవం గురించి జనాలకు ఒక క్లారిటీ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ తో ఆ న్యూస్ ను మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

గూగుల్ తల్లిని నమ్ముకుంటే.. అంతే సంగతి

గూగుల్ తల్లిని నమ్ముకుంటే.. అంతే సంగతి

పూర్తి స్థాయిలో గూగుల్ తల్లిని నమ్ముకుంటే అప్పుడప్పుడు తీవ్రంగా ఎఫెక్ట్ చూపించవచ్చని మరోసారి ఋజువయ్యింది. గతంలో రషీద్ ఖాన్ సతీమణి అనుష్క శర్మ అంటూ తప్పులో కాలేసిన గూగుల్ సెర్చ్ బార్ ఈ సారి KGF 2 క్యాస్ట్ లో కూడా బాలకృష్ణ ప్రముఖ పాత్రలో నటిస్తున్నట్లు చూపించేసింది. దీంతో ఒక్కసారిగా ఆ విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అదే నిజమైతే..

అదే నిజమైతే..

కొన్నిసార్లు కొద్దిపాటి పేర్ల వ్యత్యాసం వలన గూగుల్ లో పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. ఇక KGF 2లో ఇనాయథ్ ఖాళీళ్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నాడు అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఒక వేల నిజమైన అయ్యి ఉండొచ్చని రూమర్స్ వస్తున్నాయి. అదే జరిగితే గనక టాలీవుడ్ లో ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయనవసరం లేదనే చెప్పాలి. ఏదేమైనా బాలయ్య పేరు ఇలా రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

Recommended Video

Glimpse Of Kiran Abbavaram's Sebastian P.C. 524 Is Out

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X