గోపీచంద్ హీరోగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా యాక్షన్ మూవీ ప్రారంభం!
గోపీచంద్ కథానాయకుడుగా మరో చిత్రం ప్రారంభమైంది. ఛత్రపతి, సాహసం, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో లాంటి భారీ చిత్రాలను నిర్మించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఈ మూవీని నిర్మించబోతున్నారు.
సంతోష్ శివన్, జయం రాజా వద్ద శిష్యరికం చేసిన బిను సుబ్రమణ్యం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సతీష్.కె సినిమాటోగ్రఫీ అందించబోతున్నారు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఆఫీసులో బుధవారం ఫార్మల్ పూజా కార్యక్రమాలతో సినిమా లాంచ్ చేశారు. దేవుడి పటాలపై తొలి సన్నివేశం చిత్రీకరించారు. ఈ బేనర్లో రూపొందుతున్న 26వ సినిమా ఇది. తిరు దర్శకత్వంలో రూపొందుతున్న మరో మూవీ షూటింగులో గాయపడిన గోపీచంద్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. అందుకే ఆయన ఈ ప్రారంభోత్సవానికి రాలేదు.
సినిమా గురించి నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ 'గోపీచంద్ హీరోగా మా బేనర్లో రూపొందించిన 'సాహసం' చిత్రం తర్వాత మళ్లీ ఆయనతో కలిసి సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. బిను సుబ్రమణ్యం చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ప్రారంభించాం. కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మిస్తాం. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు.


Click it and Unblock the Notifications











