ప్రభాస్‌తో సినిమాపై గోపీచంద్.. కిక్కించే న్యూస్ చెప్పిన హీరో.. వర్షం తర్వాత అలాంటి మూవీ!
ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ కుమారుడిగా తొలివలపు సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు గోపీచంద్. తర్వాత ఏ హీరో చేయని విధంగా విలన్ క్యారెక్టర్స్ లో నటించి అదరగొట్టాడు. జయం, నిజం, వర్షం సినిమాల్లో ప్రతినాయకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. వీటిలో ప్రభాస్ హీరోగా త్రిష హీరోయిన్ గా వచ్చిన వర్షం మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో హీరో, విలన్ కు పోటా పోటీ సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమా తర్వాత మళ్లీ ప్రభాస్-గోపీచంద్ కాంబినేషన్ లో మూవీ రాలేదు. ఈ క్రమంలో ప్రభాస్‌తో చిత్రంపై గోపీచంద్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
హిట్ అనే లక్ష్యంతో:హీరోగా చేసిన తర్వాత మూడు సినిమాల్లో విలన్ గా మెప్పించిన గోపీచంద్ మళ్లీ యజ్ఞం చిత్రంతో కథానాయకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించాడు. తర్వాత ఆంధ్రుడు, రణం, లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. సీటీమార్, ఆరడుగుల బుల్లెట్టు, పక్కా కమర్షియల్ చిత్రాలు అంతగా సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు మరోసారి మంచి విజయం సాధించాలనే లక్ష్యంతో తనకు హిట్లు ఇచ్చిన దర్శకుడితో సినిమా చేశాడు.

అలాంటి రియాక్షన్:లక్ష్యం, లౌక్యం వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీవాస్ తో ముచ్చటగా మూడోసారి గోపీచంద్ చేసిన సినిమా రామబాణం. నటిసింహం బాలకృష్ణ సజ్జెస్ట్ చేసిన టైటిల్ తో వస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్, గ్లింప్స్ కు మంచి స్పందన వస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది.
హీరోగానే చేయనివ్వండి:సీనియర్ హీరో జగపతి బాబు కీలక పాత్ర పోషించిన రామబాణం సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించి మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ సమావేశంలో గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇకపై విలన్ గా చేస్తానో లేదో తెలియదు గానీ, ఇప్పటివరకు హీరోగా చేయనిచ్చారు. అలా హీరోగానే చేయనివ్వండంటూ కామెంట్స్ చేశాడు.

మర్చిపోయేందుకు:"రామబాణం కథను నమ్మి చేశాను. కొన్ని సినిమాల్లో కంప్లీట్ గా సాడ్ లేదా కమర్షియల్ సీన్స్ మాత్రమే ఉంటాయి. కానీ రామబాణంలో ఎంటర్టైన్ మెంట్ తో పాటు ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ ఉంటాయి. నేను ఈ సినిమాను బయట ఉన్న ప్రపంచాన్ని ఓ రెండున్నర గంటలు మర్చిపోయేందుకు చూస్తాను. ఈ కథ విన్నప్పుడు ఆ రెండున్నర గంటలు ప్రేక్షకులను కూర్చోబెట్టేలా ఉందని నమ్మి చేశాను. ఆడియెన్సుకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని గోపీచంద్ అన్నారు.

త్వరలో రిపీట్:పాన్ ఇండియా సినిమా గురించి మాట్లాడుతూ.. "ప్రస్తుతానికైతే ఎలాంటి పాన్ ఇండియా సినిమా చేయట్లేదు. రాబోయే కాలంలో అవకాశం వస్తే చేస్తా. ఒకవేళ డబ్బింగ్ అవకాశం వచ్చినా చేస్తాను" అని గోపీచంద్ తెలిపారు. 'వర్షం తర్వాత అలాంటి కాంబోను ఊహించగలమా?' అన్న ప్రశ్నకు.. "త్వరలోనే గుడ్ డబుల్ షార్ట్స్ తో సినిమా వస్తుంది" అని గోపీచంద్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్ చెప్పారు. అంటే త్వరలో ప్రభాస్-గోపీచంద్ డబుల్ షార్ట్స్ కాంబో రిపీట్ అవుతుందని ఆయన మాటలను బట్టి అర్థం అవుతోంది.

పదే పదే పిలవలేను:ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ రావడంపై "నేను పిలిస్తే ప్రభాస్ కచ్చితంగా వస్తాడు. కానీ, ఎంత స్నేహితుడైన అతడు పాన్ ఇండియా స్టార్. చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి రామబాణం సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పదే పదే పిలవలేను" అని ప్రభాస్ రావడం లేదని క్లారిటీ ఇచ్చాడు గోపీచంద్. కాగా రామబాణం చిత్రంలో కుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, తరుణ్ అరోరా, సమీపర్ తదితరులు నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











