జగపతి బాబు గోపీచంద్ అలా.. సినిమా చేయడం వరకే.. డింపుల్ హయతి కామెంట్స్

మ్యాచో హీరో గోపీచంద్ కు లక్ష్యం, లౌక్యం వంటి హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు శ్రీవాస్. తాజాగా ఆయన దర్శకత్వంలో గోపీచంద్ మూడోసారి హీరోగా నటించిన చిత్రం రామబాణం. నందమూరి నటిసింహం బాలకృష్ణ సజ్జెస్ట్ చేసిన టైటిల్ తో వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తోంది చిత్ర బృందం.

ఈ క్రమంలోనే ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి గోపీచంద్, శ్రీవాస్, హీరోయిన్ డింపుల్ హయాతి పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన పలు అంశాలపై ఆసక్తికరంగా జవాబు ఇచ్చారు డింపుల్ హయాతి, గోపీచంద్.

మే 5న థియేటర్లలో: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం రామబాణం. ఇదివరకు లక్ష్యం సినిమాలో అన్నదమ్ముల్లుగా నటించిన గోపీచంద్, జగపతి బాబు మరోసారి ఈ సినిమాలో బ్రదర్స్ క్యారెక్టర్స్ పోషించినట్లు తెలుస్తోంది. ముద్దుగుమ్మ డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మే 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు.

GopiChand rama banam press meet

యాక్షన్ సినిమా చేద్దామని: ఇటీవల నిర్వహించిన రామబాణం ప్రెస్ మీట్ లో "ఈ సినిమా ఒప్పుకునేందుకు మిమ్మల్ని పడేసిన కారణం ఏంటీ జగపతి బాబుతో నటిస్తున్నారనగానే కథ పరంగా తీసుకున్న స్పెషాలిటీస్ ఏంటీ" అని రిపోర్టర్ గోపీచంద్ ను అడిగారు. దీనికి "లక్ష్యం సినిమాలో ఎంటర్టైన్ మెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. లౌక్యం ఫుల్ ఎంటర్టైనర్. మళ్లీ ఒక సినిమా చేద్దామన్నప్పుడు ఒక యాక్షన్ సినిమా చేద్దామన్నాడు" అని గోపీచంద్ తెలిపారు.

GopiChand rama banam press meet

నాకు బోర్ కొట్టలేదు: గోపీచంద్ ఇంకా కొనసాగిస్తూ "యాక్షన్ సినిమా వద్దు వాసు. ఇప్పటికే ఎక్కువయ్యాయి. ఫ్యామిలీ సినిమా చేసి చాలా రోజులు అయింది. అలా చేద్దామనుకున్నప్పుడు గోపిక రాజు కథ దొరికింది. ఒక గంటన్నర సేపు కథ చెప్పారు. నేను ఒక హీరోగా కథ వినను. ఒక ఆడియెన్ గా కథ వింటున్నప్పుడు నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. నేను ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా చేయలేదు" అని గోపీచంద్ అన్నారు.

రియల్ బ్రదర్స్: "మీరు అన్నట్లు కథలో ఒక బ్రదర్ క్యారెక్టర్ ఉంది. ఇందులో బ్రదర్ క్యారెక్టర్ కు మంచి స్కోప్ ఉంటుంది. అందుకోసమే జగపతి బాబు గారిని పెట్టడం జరిగింది. ఇప్పటికి మా ఇద్దరిని ఆన్ స్క్రీన్ లో బ్రదర్స్ గా చూశారు కాబట్టి రియల్ బ్రదర్స్ గా ఉంటారు అని వాసు పెట్టడం జరిగింది. అది బాగా వర్కౌట్ అయింది" అని హీరో గోపీచంద్ పేర్కొన్నారు.

dimple hayathi rama banam press meet

చాలా కేర్ తీసుకుని: డింపుల్ హయాతి మాట్లాడుతూ.. "సినిమా ఫలితం మీరే చెప్పాలి. సినిమా చేయడం వరకే మా బాధ్యత. ఆ తర్వాత ఆడియెన్స్ అప్రిషియేషన్స్, మీ అప్రిషియేషన్స్ ను బట్టి అది నెంబర్ వన్ ఆ.. నెంబర్ 2 ఆ అది ఏమైనా గానీ మీ నుంచే వస్తుంది. ఒక నటిగా ఆ పాత్ర ఏంటీ.. దానికి ఎలా చేస్తే బాగుంటుంది. ఖిలాడీలో అయినా ఇందులో అయినా క్యారెక్టర్ కు ఏం చేస్తే బాగుంటుంది. నిజానికి నాకు తెలిసి చాలా కేర్ తీసుకుని చేసిన క్యారెక్టర్ ఇది. సో ఇది కూడా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X