Don't Miss!
- News
హస్తిన గడ్డపై జగన్ గర్జన- భీమిలీ రోడ్లో సెక్రెటేరియట్: విశాఖపై తొలి ప్రకటనతో జోష్: ..!!
- Lifestyle
ప్రసవం న్యాచురల్ గా జరగాలంటే ఎలాంటి ఆహారాలు తినాలో మీకు తెలుసా?
- Finance
Economic Survey: ఆర్థిక సర్వేలో వెల్లడైన సవాళ్లు.. ఎదుర్కొంటామని నిర్మలమ్మ ధీమా..!
- Sports
Archana Devi: ప్రపంచకప్ గెలిచిన ‘మంత్రగత్తె’బిడ్డ! ఇంట్లో నీళ్లు కూడా తాగని వారు..!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
పవన్ కళ్యాణ్ తో అలాంటి సినిమా.. ఇదివరకే చర్చలు జరిగాయి: గోపిచంద్ మలినేని
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అవకాశం వస్తే సినిమా చేయాలి అని చాలామంది దర్శకులు ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా నేటితరం దర్శకులు అయితే ఆయనతో ఒక్కసారి అయిన వర్క్ చేయాలని అనుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ సక్సెస్ లో ఉన్న ఫెయిల్యూర్ లో ఉన్నా కూడా ఎప్పుడు ఒకే స్థాయిలో తన రేంజ్ను కొనసాగిస్తూ ఉంటాడు. అందుకే ఆ స్టార్ హీరోతో సినిమా చేయాలి అని జూనియర్, సీనియర్ దర్శకులు అందరూ కూడా కోరుకుంటుంటారు.
ఇక ఇటీవల వీర సింహారెడ్డి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా పవన్ కళ్యాణ్ పై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. డాన్ శీను సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గోపీచంద్ ఆ తర్వాత బలుపు పండగ చేసుకో క్రాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తో వీర సింహారెడ్డి సినిమాతో పరవాలేదు అనిపించాడు.

అయితే పవన్ కళ్యాణ్ తో గతంలోనే ఒక సినిమా చేయాలని అనుకున్నాడట. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అతను పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టమైన వ్యక్తి. చాలాసార్లు కొన్ని కథలపై ఆయనతో చర్చించడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం ఆయన లైన్అప్ చాలా పెద్దగా ఉంది. ఒకవేళ ఆయన నాకు ఛాన్స్ ఇస్తే కనుక తప్పకుండా ఆయనతో సినిమా చేస్తాను.
ఆయనకు సెట్ అయ్యే విధంగా మంచి కామెడీ మా సాంగిల్ లో ఒక మాస్ సినిమా చేయాలని ఉంది అని గోపీచంద్ మలినేని తన కోరికను తెలియజేశాడు. ఇక గోపీచంద్ మలినేని ప్రస్తుతం వీర సింహారెడ్డి సక్సెస్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే అతను తదుపరి సినిమాను కూడా వీలైనంత తొందరగా తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. నెక్స్ట్ కూడా ఈ హీరో రవితేజతో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అది కూడా క్రాక్ సీక్వెల్ అని అంటున్నారు. మరి ఆ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.