మెగా సక్సెస్ రావాలి.. మెహర్ రమేష్‌పై గోపీచంద్ మలినేని కామెంట్స్
స్టైలీష్ దర్శకుడిగా మెహర్ రమేష్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన సినిమాలు అంతగా మెప్పించపోయినా కూడా మేకింగ్ పరంగా మాత్రం కొత్తదనం కనిపిస్తుంది. మాస్ ప్రేక్షకులను ఎలా మెప్పించాలో తెలిసిన దర్శకుడు మెహర్ రమేష్. అదృష్టం కలిసి రాక ఆయన తీసిన సినిమాలన్నీ బోల్తా కొడుతూ వస్తున్నాయి. షాడో సినిమా తరువాత మెహర్ రమేష్ పూర్తిగా కనుమరుగయ్యాడు. ఆ మధ్య సినిమా ఈవెంట్లలో, మెగా కాంపౌండ్ ఈవెంట్లలో కనిపించేవాడు.
అలాంటి మెహర్ రమేష్‌కు చిరంజీవి చాన్స్ ఇచ్చాడు. మెహర్ రమేష్‌తో సినిమా చేయబోతోన్నాను అని చిరంజీవి ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. మెహర్ రమేష్‌కు చిరు అవకాశం ఇవ్వడమేంటని నెటిజన్లు గుసగుసలాడుకున్నారు. అయితే అది వేదాళం రీమేక్ అని తెలిసిపోయింది. ఆల్రెడీ హిట్ అయిన కథే కాబట్టి ఎలాంటి సమస్యలు రాకపోవచ్చని మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

నేడు (నవంబర్ 6) మెహర్ రమేష్ బర్త్ డే. మెహర్ రమేష్‌కు మహేష్ బాబు విషెస్ తెలిపాడు. డైరెక్టర్ గోపీచంద్ ట్వీట్ చేస్తూ మెగా సక్సెస్ కొట్టాలని చిరంజీవి సినిమా గురించి పరోక్షంగా గుర్తు చేశాడు. దానికి బదులుగా మెహర్ రమేష్ స్పందిస్తూ.. క్రాక్ సినిమాతో రవితేజతో హ్యాట్రిక్ ఫినిష్ చేసేయ్ అంటూ గోపీచంద్‌కు రిప్లై ఇచ్చాడు. మొత్తానికి ఇలా ఒకరి సినిమాలు హిట్ అవ్వాలని ఇంకో డైరెక్టర్ కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











