Just In
- 7 hrs ago
విభిన్న కథాంశంతో సమంత.. టాలీవుడ్‌కు మరో టాలెంటెడ్ డైరెక్టర్
- 8 hrs ago
Youtuber Shanmukh Jaswanth arrested: మద్యం మత్తులో కారు నడిపి.. ప్రమాదం
- 8 hrs ago
ట్రెండింగ్ : అలా కాలు జారి.. ఆ అవసరం లేకుండానే గర్భం దాల్చుతా.. రెండో పెళ్లిపై సురేఖా వాణి రియాక్షన్
- 9 hrs ago
అందుకే విడాకులు తీసుకొన్నా.. భర్తతో విభేదాలపై గుట్టువిప్పిన అమలాపాల్
Don't Miss!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఓ రాశి వారికి ఆన్ లైన్ బిజినెస్ లో కలిసొస్తుంది...!
- News
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం... సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన ఆ ఇన్నోవా కారు...
- Finance
Sovereign gold bond: మార్చి 1 నుండి గోల్డ్ బాండ్స్, ధర ఎంతంటే
- Sports
India vs England: పూణేలోనే వన్డే సిరీస్.. ప్రేక్షకులకు మాత్రం నో ఎంట్రీ!!
- Automobiles
మీకు తెలుసా.. సిట్రోయెన్ షోరూమ్ ఇప్పుడు బెంగళూరులో
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘క్రాక్’ తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా: క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని
'డాన్ శ్రీను', 'బలుపు' వంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత మాస్ మహారాజా రవితేజ - యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'క్రాక్'. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దీంతో నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను దాటేసి లాభాల బాటలో పయనించింది. ఇప్పటి వరకు దాదాపు రూ. పది కోట్లకు పైగా ఆదాయాన్ని అందుకున్న ఈ చిత్రం.. చాలా ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ షోలతో సత్తా చాటుతోంది. దీంతో ఈ మూవీ డైరెక్టర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.
'క్రాక్'తో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేని టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఆ సినిమాలో హీరో రవితేజను ఆయన చూపించిన విధానానికి ప్రేక్షకులతో పాటు చాలా మంది హీరోలు కూడా ఫిదా అయిపోయారు. ఈ కారణంగానే అతడితో సినిమా చేసేందుకు తెలుగులోని చాలా మంది హీరోలు పోటీ పడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎనర్జిటిక్ డైరెక్టర్ నటసింహా నందమూరి బాలకృష్ణతో ఓ పవర్‌ఫుల్ మూవీ చేయబోతున్నాడని కొద్ది రోజులుగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

తాజాగా గోపీచంద్ మలినేని ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఫ్యూచర్ ప్రాజెక్టులతో పాటు నందమూరి బాలకృష్ణ సినిమా ఉంటుందా ఉండదా అన్న దానిపైనా వివరణ ఇచ్చారు. 'గత పదేళ్లలో నేను చాలా తక్కువ సినిమాలే చేశాను. కానీ, రాబోయే పదేళ్లలో పాటు రెట్టింపు సినిమాలు చేయబోతున్నా. ఇక, బాలయ్యతో సినిమా ఉంటుందా అంటే ఇప్పుడే చెప్పలేను. దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో ఈ సినిమా ఉండే ఛాన్స్ ఉంది' అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చాడు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.