బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీ: అదిరిపోయే బ్యాగ్‌డ్రాప్ రెడీ చేసిన డైరెక్టర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అంత వేగంగా ఎవరూ సినిమాలు చేయలేరన్న టాక్ ఉంది. ఒక మూవీ పట్టాలపై ఉండగానే.. మరికొన్నింటిని లైన్‌లో పెడుతుండడం వల్లే ఆయనకు ఈ పేరు వచ్చింది. గతంలో ఏడాది ఏడెనిమిది సినిమాలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, ఇటీవలి కాలంలో నటసింహా కొంత స్పీడు తగ్గించారనే చెప్పాలి. ఇక, ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న బాలయ్య.. అది షూటింగ్ జరుపుకుంటుండగానే 'క్రాక్' దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపేశారన్న విషయం తెలిసిందే.
పవర్‌ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నందమూరి బాలకృష్ణ చేయబోతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. అటు దర్శకుడు, ఇటు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఈ కాంబోపై ఇప్పటి నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను భారీగా రూపొందించేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు, త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేసి.. సంక్రాంతి కానుకగా 2022లో విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది.

ఇక, 'క్రాక్' మాదిరిగానే ఈ మూవీ కూడా నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ కథ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. బాలయ్యతో తీసే ఈ సినిమా కోసం గోపీచంద్ మలినేని రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో ఓ కథను రెడీ చేశాడట. ఇది కూడా రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగానే రాసినట్లు తెలుస్తోంది. ఇందులో నటసింహం రోల్ ఎంతో పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు తెలిసింది. గతంలో ఫ్యాక్షన్ కథలతో బాలయ్య చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లు అయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











