బాలయ్య డైరెక్టర్‌తో మెగాస్టార్ చిరంజీవి: ఆ సినిమాకు మించిన పవర్‌ఫుల్ స్టోరీతో!

ఆరు పదుల వయసులోనూ అదే ఊపుతో కనిపిస్తూ.. వరుసగా సినిమాల మీద సినిమాలను చేస్తూ రాకెట్ స్పీడుతో దూసుకుపోతోన్నారు బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. రీఎంట్రీలో మరింత ఉత్సాహంతో కనిపిస్తోన్న ఆయన.. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే గత సంక్రాంతికి ఈ మెగా హీరో 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి భారీ స్పందన దక్కడంతో కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాదు ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించి ఎన్నో రికార్డులను సైతం ఇది బ్రేక్ చేసేసింది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' అనే సినిమాను చేస్తున్నారు. తమిళ చిత్రం 'వేదాళం'కు రీమేక్‌గా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అయినప్పటికీ ఆయన కొత్త ప్రాజెక్టుల కోసం కథలను వింటున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది యంగ్ అండ్ సీనియర్ డైరెక్టర్లతో చిరు చర్చలు జరిపారని తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవలే టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఆయనను కలిసి ఓ లైన్ వినిపించాడని ఫిలిం నగర్ ఏరియాలోనే ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అలాగే, తాజాగా మరో న్యూస్ బయటకు వచ్చింది.

Gopichand Malineni Writing a Story for Chiranjeevi

తన లైన్‌కు మెగాస్టార్ చిరంజీవి ఓకే చెప్పడంతో గోపీచంద్ మలినేని వెంటనే దానిపై స్క్రిప్టు వర్కును మొదలు పెట్టాడని తాజాగా తెలిసింది. అంతేకాదు, ఈ మూవీ కోసం ఇప్పటి వరకూ తాను చేయనంత పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేస్తున్నాడని అంటున్నారు. ఈ కథలో కొన్ని రియల్ ఇన్సిడెంట్లను కూడా యాడ్ చేస్తున్నాడని, హీరో ఎలివేషన్ సీన్స్ మరింత హైలైట్‌గా రాసుకుంటున్నాడని సమాచారం. దీంతో ఇప్పుడీ న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ కథ పూర్తైన వెంటనే గోపీచంద్.. చిరంజీవికి వినిపిస్తాడట. ఆయన ఓకే అంటే అధికారికంగా ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. గోపీచంద్ మలినేని తన గత చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో చేసిన విషయం తెలిసిందే. 'వీర సింహా రెడ్డి' అనే పేరుతో వచ్చిన ఈ మూవీ బిగ్ హిట్ అయింది. ముఖ్యంగా ఇందులో బాలయ్యను చూపించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. ఇప్పుడు అంతకు మించిన పవర్‌ఫుల్ రోల్‌ను చిరంజీవి కోసం అతడు డిజైన్ చేస్తున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X