twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోపీచంద్ - మారుతి సినిమా టైటిల్: ‘పక్కా కమర్షియల్’ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్‌గా కెరీర్‌ను ఆరంభించి.. హీరోగా మారిపోయాడు టాలెంటెడ్ హీరో గోపీచంద్. ఆరంభంలోనే పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్న అతడు.. సూపర్ స్పీడుగా సినిమాలు చేస్తూ వచ్చాడు. దీంతో మధ్యలో కొన్ని పరాజయాలను చవి చూడాల్సి వచ్చింది. దీంతో కొన్నేళ్లుగా గ్యాప్ తీసుకుంటూ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. అయినప్పటికీ అతడికి సరైన విజయం మాత్రం దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైవిధ్యమైన చిత్రాలను చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే టాలెంటెడ్ డైరెక్టర్ మారుతితో జత కట్టాడతను.

    వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే మారుతి.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నాడు. రెండేళ్ల క్రితం 'ప్రతిరోజూ పండగే'తో భారీ విజయాన్ని అందుకున్నాడు. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకుని గోపీచంద్‌తో సినిమా చేస్తున్నట్లు ఓ సెటైరికల్ వీడియోతో ప్రకటించారు. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్ చేస్తామని ఓ ఫన్నీ కార్టూన్ ద్వారా శనివారం వెల్లడించారు.

     Gopichand - Maruthi Movie Title Pakka Commercial

    అందులో 'అరేయ్ ఓ వందిస్తే గోపీచంద్.. మారుతి సినిమా టైటిల్ చెబుతా. రేపు ముహూర్తం టైమ్‌కి' అని ఒకరు అంటే.. 'అరేయ్ టైటిల్ చెప్పడానికి కూడా డబ్బులేంట్రా. మరీ ఇంత కమర్షియలా' అంటూ మరొకరు అన్నట్లు ఆ కార్టూన్‌లో చూపించారు. ఇప్పుడు అందుకు అనుగుణంగానే ఈ సినిమా టైటిల్‌ను 'పక్కా కమర్షియల్' అంటూ ప్రకటించారు. ఇందులో ఓ చేతిని మాత్రమే చూపించారు. ఇక, ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను మార్చి 5 నుంచి ప్రారంభిస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    Director Maruthi has announced his next film. The untitled movie will see him team up with action star Gopichand. The film will jointly be produced by UV Creations and GA2 Pictures. Maruthi’s last film, Prati Roju Pandage, hit the screens in December 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X