Gopichand: రూట్ మార్చిన గోపీచంద్.. ఆ దర్శకుడితో కొత్త మూవీ.. అదిరిపోయిన న్యూ లుక్!
ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ కుమారుడిగా తొలివలపు సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు గోపీచంద్. తర్వాత ఏ హీరో చేయని విధంగా విలన్ క్యారెక్టర్స్ లో నటించి అదరగొట్టాడు. జయం, నిజం, వర్షం సినిమాల్లో ప్రతినాయకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఈ సినిమా తర్వాత యజ్ఞం మూవీతో మళ్లీ హీరోగా సినీ కెరీర్ ను ప్రారంభించాడు. తర్వాత అనేక హిట్ సినిమాలతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ రీసెంట్ మూవీ రామబాణం ప్లాప్ గా నిలిచింది. ఇప్పుడు సరికొత్త అవతారంలో న్యూ మూవీతో రానున్నాడు.

మ్యాచో హీరో గోపీచంద్ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ వస్తున్నాయి. పక్కా కమర్షియల్, రామబాణం సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం మూటగట్టుకున్నాయి. లక్ష్యం, లౌక్యం వంటి హిట్ చిత్రాలను అందించిన డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన రామబాణం డిజాస్టర్ గా నిలవడంతో గోపీచంద్ నిరాశచెందినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రొటీన్ మూవీస్ కాకుండా తన రూట్ మార్చుకుని డిఫరెంట్ గా ప్రయత్నిస్తూ తన కొత్త మూవీని ప్రకటించాడు గోపీచంద్.
అంతేకాకుండా ఈసారి కన్నడ డైరెక్టర్ ఏ. హర్ష దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఆయన ఇంతకుముందు అగ్ర హీరో శివరాజ్ కుమార్ తో వేద మూవీని తెరెకక్కించారు. ఇవాళ అంటే జూన్ 12 గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకు భీమా అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ థ్రిల్ చేసేలా ఉంది. ఇందులో గోపీచంద్ తన గెటప్ పూర్తిగా మార్చేశాడు. పోస్టర్ లో గోపీచంద్ ను చూస్తుంటే అతని క్యారెక్టర్ చాలా వైల్డ్ గా ఉంటుందని అర్థం అవుతోంది.
భీమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో రంకెలేస్తున్న ఎద్దును ఓవైపు చూపిస్తూ.. మరోవైపు కోరమీసంతో పౌరుషం చూపిస్తున్న పోలీస్ ఆఫీసర్ లుక్ లో గోపీచంద్ ఉన్నాడు. ఈ లుక్ అదిరిపోయేలా ఉంది. భీమా అనే టైటిల్ లో బేడీలు ఉంచి అట్రాక్ట్ చేసేలా ఉంది. పోస్టర్ చూస్తుంటే ఒంగోలు గిత్త అన్నట్లుగా గోపీచంద్ ను చూపించారేమో అనే డౌట్ వస్తుంది. చూస్తుంటే గోపీచంద్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ గా ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











