Bhimaa Trailer: కలియుగ బ్రహ్మరాక్షసుడే భీమా.. ఊచకోత మొదలెడితే ఊర్లో స్మశానమే చాలదట!
హీరో గోపీచంద్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం అంతకు మించిన నటనతో అందరినీ మెప్పించగల సత్తా కల్గిన ఈయన.. తాజాగా భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎలాగైనా సరే ఈ సారి హిట్ కొట్టాలనే కసితో ఏ హర్ష దర్శకత్వంలో భీమా అనే సినిమా చేస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల అయింది. ఆ పూర్తి వివరాలు మనం ఇప్పుడు చూద్దాం.
భీమా సినిమాను కెకె రాధామోహన్ నిర్మించగా.. గోపీచంద్ సరసన ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటించారు. నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘు బాబు, ముఖేష్ తివారీ, చమ్మక్ చంద్ర, నిహారిక కొణిదెల, రోహిణిలు ప్రధాన పాత్రల్లో కనిపించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయింది. ఇందులో ముందుగా శివలింగాన్ని చూపించారు. అందులో పైనుంచి నీళ్లు పడుతుండగా... అభిషేకం చేస్తున్నట్లు చూపించారు.

ఆ తర్వాత అఘోరాలు అంతా కలిసి అక్కడే పూజ చేయడం.. గుడి తలుపులు మూయడం చూపించారు. అంతా కలిసి ప్రత్యేక పూజలు చేస్తుండడం చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక దీని తర్వాత ఆ శ్రీ మాహావిష్ణువు ఆరో అవతరాం.. పరుశురాముడు అని చెప్పారు. తన గండ్రగొడ్డలితో అనంత సాగరాన్నే వెనక్కి పంపి, ఒక అద్భుతమైన నేలను సృష్టించాడని చెప్పుకొచ్చారు. అదే పరశురాముడి క్షేత్రం అంటూ ఓ పురాతన ఆలయాన్ని చూపించారు.
అక్కడ ఆ అపర శివుడే కొలువు అయ్యాడంటూ వివరించడం... కొందరు రాక్షసులు తమ అహంకారంతో విర్ర వీగుతున్నప్పుడు వాళ్ల అంతు కోరి త్రినేత్రుడే కాల నేత్రుడై ఓ బ్రహ్మ రాక్షసుడిని నేలకు పంపాడని చెప్పారు. ఇలా ఈ కథ చెప్పిన తర్వాత గోపీంచద్ ను పోలీసు రూపంలో చూపించారు. దీన్ని బట్టి చూస్తుంటే... ఈ సినిమాలో హీరో గోపీచంద్ బ్రహ్మరాక్షసుడిగా అంటే మంచివైపు పోరాడే వ్యక్తిగా కనిపించబోతున్నట్లు అర్థం అవుతుంది. అలాగే హీరో పేరు భీమా అని తెలుస్తోంది.

ఆ తర్వాత గోపీచంద్ పూజ చేయడం.. ఆయన చుట్టూ ఓ వలయం ఏర్పడడం చూస్తుంటే దేవుడికి సంబంధించిన ఏదో కథ కూడా ఉన్నట్లు అర్థం అవుతుంది. ముఖ్యంగా గోపీచంద్ .. నేను ఊచకోత మొదలుపెడితే.. ఈ ఊర్లో స్మశానం కూడా సరిపోదు నా కొడక అంటూ చెప్పిన డైలాగ్ అయితే అధిరిపోయింది. ఇలా ఆద్యంతం ఆకట్టుకున్న ఈ ట్రైలర్ చూస్తుంటే.. సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. మార్చి 8వ తేదీన ఈ భీమా సినిమాను విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











