గోపీచంద్ హీరోగా స్పై థ్రిల్లర్... టైటిల్ ఫిక్స్ అయింది!
గోపీచంద్ హీరోగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. చాణక్య అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం స్పై థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగోను ఆదివారం దర్శక నిర్మాతలు విడుదల చేశారు.
దర్శకుడు తిరు.. గోపీచంద్‌ను సరికొత్త పంథాలో చూపిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జరీనా ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 50 శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుత షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది.

విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బ్యానర్: ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్, మాటలు: అబ్బూరి రవి, ఆర్ట్: రమణ వంకా, కోడైరెక్టర్: దాసం సాయి, రాజ్‌మోహన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తిరు
కాగా... ఈ మధ్య కాలంలో గోపీచంద్ సరైన హిట్టు పడక సతమతం అవుతున్నాడు. ఆయన చివరి చిత్రం 'పంతం' 2018 జూలైలో విడుదలైంది. కె చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications











