Pakka Commercial: అన్ని వందల థియేటర్లలో పక్కా కమర్షియల్.. గోపీచంద్ కెరీర్‌లో రికార్డు

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే, అందులో కొందరు మాత్రం ఇప్పటికీ భారీ సక్సెస్ కోసం వేచి చూస్తున్నారు. అలాంటి వారిలో మ్యాచ్ స్టార్ గోపీచంద్ ఒకడు. విలన్ పాత్రలతో ఫేమస్ అయిన అతడు.. హీరోగా మారిన తర్వాత కొన్ని విజయాలను అందుకున్నాడు. కానీ, ఆ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయడంలో మాత్రం ఈ టాల్ హీరో విఫలం అయ్యాడు. దీంతో వరుసగా ఎన్నో పరాజయాలను చవి చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలను చేస్తూనే ఉన్నాడు. ఇలా తన అభిమానులను ఉత్సాహ పరుస్తూనే ఉన్నాడు.

వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న సమయంలోనే గోపీచంద్ గత ఏడాది 'సీటీమార్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. అయితే, ఫుల్ రన్‌లో మాత్రం ఈ సినిమా టార్గెట్‌ను చేరుకోలేపోయింది. కానీ, ఈ ఫలితం పట్ల అటు గోపీచంద్, ఇటు చిత్ర యూనిట్ హ్యాపీగానే ఉంది. ఈ ఉత్సాహంతోనే ఈ టాలెంటెడ్ హీరో.. ఆ వెంటనే మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' అనే సినిమాను ప్రారంభించాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా నెలకొన్నాయి.

'పక్కా కమర్షియల్' సినిమా అనౌన్స్ చేసిన సమయంలోనే దీని విడుదల తేదీని కూడా ప్రకటించారు. కానీ, ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ సజావుగా సాగలేదు. దీంతో చిత్రీకరణపై ప్రభావం పడింది. ఫలితంగా ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా జూలై 1వ తేదికి వాయిదా పడింది. దీనికి సమయం ఆసన్నమవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటలను విడుదల చేయగా.. కొన్ని రోజులుగా చిత్ర యూనిట్ ఇంటర్వ్యూలు, ఈవెంట్లు చేస్తూ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది.

Gopichand Pakka Commercial Movie Worldwide Total Theaters Count

గోపీచంద్ - మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న 'పక్కా కమర్షియల్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని బిజినెస్ భారీ ధరలకు జరిగింది. ఇక, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 235, సీడెడ్‌లో 120, ఆంధ్రాలో 270 వరకూ అంటే మొత్తంగా 625 నుంచి 650 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 80, ఓవర్సీస్‌లో 250 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 955 నుంచి 1000 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అంటే ఈ సినిమా ఇప్పటి స్టార్ హీరోల చిత్రాలకు సమానంగానే విడుల కాబోతుంది. ఇది గోపీచంద్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అని అంటున్నారు.

కమర్షియల్ పంథాలో సాగే కామెడీ ఎంటర్‌టైనర్ రూపొందిన 'పక్కా కమర్షియల్' మూవీలో గోపీచంద్ లాయర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించారు. జాక్స్ బెజాయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ సహా పలువురు ప్రముఖులు కీలక పాత్రలను చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X