Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
‘పక్కా కమర్షియల్’గా ప్రారంభమైన సినిమా: సరికొత్తగా కనిపించనున్న గోపీచంద్
కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్నా.. 'లౌక్యం' తర్వాత సరైన హిట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటోన్నాడు టాలెంటెడ్ స్టార్ గోపీచంద్. అప్పటి నుంచి విజయాన్ని అందుకోవడం కోసం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. అయినప్పటికీ ఎంతో వేగంగా సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు సరికొత్త ప్రయోగాలు చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతితో 'పక్కా కమర్షియల్' అనే సినిమాను ప్రకటించాడు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం అయింది. హైదరాబాద్ యూసఫ్‌గూడాలో ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో చిత్రీకరణను మొదలు పెట్టారు. మొదటి రోజు హీరోపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే మారుతి ఈ సినిమా మాత్రం సోషల్ మెసేజ్‌తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో గోపీచంద్ లాయర్‌గా కనిపించబోతున్నాడని అంటున్నారు. అది కూడా ఇప్పటి వరకూ చేయని సరికొత్త పాత్ర అని టాక్. అతడి గెటప్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందట.
అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్లపై బన్నీ వాస్ 'పక్కా కమర్షియల్'ను నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారట. అందులో ఒకరు గ్లామరస్ క్వీన్ రాశీ ఖన్నా కాగా.. మరొకరు తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా అని తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభం కాక ముందే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. అక్టోబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.