చాణక్య సెన్సార్ సర్టిఫికేట్.. రన్ టైమ్ ఎంతంటే..!
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా చాణక్య. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెహరీన్, జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటించారు. యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్‌గా రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్‌గా వ్యవహరించారు.
దేశవిదేశాల్లోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 5వ తేదీన విడుదలకు సిద్ధమైంది. చాణక్య చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా రన్ టైమ్ 147 నిముషాలు అని పేర్కొంటూ సెన్సార్ బోర్డు వారు ఇచ్చిన సర్టిఫికేట్‌ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది చిత్రయూనిట్.

గోపీచంద్ సినిమాలంటేనే తెలుగు బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే జయాపయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఉంటాడు గోపీచంద్. కాకపోతే ఈ సారి కాసింత గట్టిపోటీకే దిగాడు మ్యాచో స్టార్. ఓ పక్కన సైరా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంటే.. దానికి పోటీగా బరిలోకి దిగుతున్నాడు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడంలో అందె వేసిన చేయి తమిళ డైరెక్టర్ తిరుది. అతని స్టైల్ లోనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారని సమాచారం.


Click it and Unblock the Notifications











