For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బర్త్ డే స్పెషల్: గోపీచంద్ ‘చాణక్య’ ఫస్ట్‌లుక్ అదిరిపోయిందిగా

|

తెలుగు నటుడు గోపీచంద్ త్వరలో 'చాణక్య' మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ ప్రకటించగా నేడు (జూన్ 12) హీరో పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. భారీగా గడ్డం పెంచేసిన సీరియస్ లుక్‌లో గోపీచంద్ దర్శనమిచ్చారు.

ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్పై థ్రిల్ల‌ర్ కాన్సెప్టుతో రూపొందుతున్నట్లు ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వం వహిస్తున్నారు. గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Gopichand’s Chanakya first look released

ద‌ర్శ‌కుడు తిరు.. గోపీచంద్‌ను స‌రికొత్త పంథాలో చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే విధంగా ఉంటాయని, ఆద్యంతం సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచే విధంగా ఉంటుందని నిర్మాతలు వెల్లడించారు. ఇందులో మెహ్రీన్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ జ‌రీనా ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఇప్పటికే 50 శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ‌ పూర్తయింది. తాజా షెడ్యూల్ హైద‌రాబాద్‌లో వేగంగా జరుగుతోంది. విశాల్ చంద్ర శేఖ‌ర్ సంగీతం అందిస్తుండగా వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. బ్యాన‌ర్‌: ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, నిర్మాత‌: రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గ‌రిక‌పాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గ‌రిక‌పాటి, కో ప్రొడ్యూస‌ర్స్‌: అజ‌య్ సుంక‌ర‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, మాట‌లు: అబ్బూరి ర‌వి, ఆర్ట్‌: ర‌మ‌ణ వంకా, కోడైరెక్ట‌ర్‌: దాసం సాయి, రాజ్‌మోహ‌న్‌, క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: తిరు

English summary
Gopichand’s upcoming film ‘Chanakya’ first look released. Gopichand has sported beard and looks serious and composed.Tamil director Thiru is directing ‘Chanakya’ while Mehreen is romancing the hero. AK Entertainments banner is producing the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more