చాణక్య టీజర్: ‘రా’ ఏజెంటుగా గోపీచంద్ యాక్షన్ అదుర్స్
గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ చాణక్య. తిరు దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. తాజాగా టీజర్ విడుదలైంది.
టీజర్ చూస్తుంటే... ఇందులో గోపీచంద్ 'రా' ఎజెంటుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. టెర్రరిస్టులతో పోరాటం నేపథ్యంలో కథ సాగుతుంది. యాక్షన్ సీన్లు చేయడంలో గోపీచంద్ ఆరితేరిపోయారు. అభిమానులు ఏ మాత్రం డిసప్పాయింట్ కాకుండా ఈ సినిమా ఉండబోతోందని టీజర్ స్పష్టం చేస్తోంది.

గోపీచంద్‌కు సరైన హిట్ పడి చాలా కాలం అయింది. ఈ సినిమాతో అతడు మళ్లీ ఫాంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు గోపీచంద్ చేసిన సినిమాలన్నింటికంటే ఇది భిన్నంగా ఉంటుందని, కమర్షియల్ ఎలిమెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటాయని చిత్రబృందం తెలిపింది.
ఈ చిత్రంలో గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి, కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి, రైటర్: అబ్బూరి రవి, ఆర్ట్: రమణ వంక, కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు.


Click it and Unblock the Notifications











