‘సీటీమార్’ ఓటీటీ రిలీజ్‌కు లైన్ క్లియర్: గోపీచంద్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే!

హీరోగా కెరీర్‌ను ఆరంభించి.. విలన్‌గా ఫేమస్ అయ్యాడు టాలెంటెడ్ స్టార్ గోపీచంద్. కొన్ని సినిమాల్లో నెగెటివ్ పాత్రలతో భయపెట్టిన అతడు.. ఆ తర్వాత మళ్లీ హీరోగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే కెరీర్ ఆరంభంలో పలు సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. అలా ప్రయాణం సాఫీగా సాగిపోతోన్న సమయంలో అతడిని వరుస పరాజయాలు ఇబ్బందులకు గురి చేశాయి. కమర్షియల్ పంథాలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఈ టాల్ హీరో.. సరైన హిట్ దొరకక చాలా రోజులుగా సతమతం అవుతూనే ఉన్నాడు. దీంతో స్టైల్‌ను మార్చుకున్నాడు.

అప్పుడెప్పుడో వచ్చిన 'లౌక్యం' తర్వాత ఆ రేంజ్ విజయాన్ని అందుకోలేకపోయాడు గోపీచంద్. దీని తర్వాత హిట్ కోసం అన్వేషిస్తోన్న అతడు.. పంథాను మార్చుకుని ప్రయోగాత్మక చిత్రాలను చేస్తున్నాడు. అయినప్పటికీ సక్సెస్ అందనంత దూరంలోనే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అతడు సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించాడు. ఇది ఎప్పుడో షూటింగ్ పూర్తైనా.. అనివార్య కారణాల వల్ల విడుదల మాత్రం కావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమై వార్త ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అవుతోంది.

Gopichands Seetimaarr​ Movie Release on Sun Nxt

'సీటీమార్' ఎప్పటి నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న థియేటర్లలోకి తీసుకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో దీన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారని చాల రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఎటువంటి ప్రకటననూ చేయడం లేదు. తాజా సమాచారం ప్రకారం.. గోపీచంద్ నటించిన 'సీటీమార్' మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో నేరుగా విడుదల అవుతుందట. ఇందుకోసం ఇప్పటికే చిత్ర యూనిట్‌కు ఆ సంస్థకు మధ్య ఒప్పందం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం సదరు సంస్థ భారీగానే ఆఫర్ ఇచ్చిందని సమాచారం.

'సీటీమార్' ఓటీటీ డీల్‌కు సంబంధించిన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి ఈ సినిమా కోసం చాలా సంస్థలు పోటీ పడగా.. సన్ నెక్ట్స్ అత్యధిక మొత్తం వెచ్చించి దీని హక్కులను కొనుగోలు చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ నెలలోనే ఈ సినిమాను విడుదల చేస్తారని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ కొద్ది రోజుల్లోనే వెలువడనుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో గోపీచంద్‌కు జోడీగా తమన్నా నటించింది. వీళ్లిద్దరూ రెండు కబడ్డీ జట్లకు కోచ్‌లుగా వ్యవహరించారు.

గోపీచంద్ కెరీర్‌లోనే క్లిష్ట పరిస్థితుల్లో వస్తున్న 'సీటీమార్' నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక, దీన్ని మూవీని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. భూమిక చావ్లా కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, ఇందులో అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. వీళ్లతో పాటు రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్యమైన రోల్స్‌లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X