గోపీచంద్ కోసం వచ్చిన సమంత: కేక పెట్టిస్తోన్న ‘సీటీమార్’ టైటిల్ సాంగ్.. అదరగొట్టిన మణిశర్మ
కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్నాడు మచో హీరో గోపీచంద్. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం సంపత్ నందితో జత కట్టాడు. 'గౌతమ్ నంద' వంటి డిజాస్టర్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'సీటీమార్'. కబడ్డీ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తోన్న ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందింది. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీలోని టైటిల్ సాంగ్‌ను స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు.
గోపీచంద్ కొత్త సినిమాలోని 'సీటీమార్.. సీటీమార్' అంటూ సాగే టైటిల్ సాంగ్ తాజాగా విడుదలైంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీత సారథ్యంలో యువ సింగర్లు అనురాగ్ కులకర్ణీ, రేవంత్, వరంలు ఈ పాటను ఆలపించారు. కాసర్ల శ్యామ్ దీనికి లిరిక్స్ అందించారు. పాపికొండల నడుమ సాగే గోదావరి అందాలను అభివర్ణిస్తూ ఈ పాట ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత టైటిల్ ట్రాక్‌తో కూడా మోటివేషనల్ సాంగ్ వస్తుంది. ఈ పాటలో మ్యూజిక్, సింగింగ్‌తో పాటు పిక్చరైజేషన్ బాగుంది. దీంతో ఈ లిరికల్ వీడియోకు తక్కువ సమయంలోనే మంచి స్పందన వస్తోంది.

గోపీచంద్ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్‌గా చేస్తోంది. భూమిక చావ్లా కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, ఇందులో అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. వీళ్లతో పాటు రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. గోపీచంద్‌తో పాటు తమన్నా కూడా కబడ్డీ కోచ్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











