ఓటీటీ విడుదలకు సిద్దమైన గోపిచంద్ సీటీమార్.. డేట్ ఫిక్స్!

మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న గోపీచంద్ ఇటీవల సీటీమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాస్ కమర్షియల్ సినిమాలతో కొనసాగుతున్న దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది. విడుదలకు ముందు ఒకవిధంగా అయితే బజ్ బాగా క్రియేట్ చేసింది. తప్పకుండా ఈ సినిమాతో గోపీచంద్ ఫామ్ లోకి వస్తాడని చాలా మంది అనుకున్నారు. కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

అసలైతే సిటీమార్ సినిమాను ఈ ఏడాది మొదట్లో విడుదల చేయాలని అనుకున్నారు. సమ్మర్ లో కూడా సినిమా విడుదల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అలాగే రాష్ట్రంలో టికెట్ల రేట్లు కూడా బాగా తగ్గడంతో నిర్మాతలు షూటింగ్ పూర్తయినా కూడా విడుదల చేయడానికి ధైర్యం చేయలేకపోయారు. అయితే ఒకానొక సమయంలో ఓటీటీ విడుదలకు కోసం ప్రయత్నాలు జరిగాయి. నిర్మాతలు కూడా ఓటీటీ లో విడుదల చేస్తే సేఫ్ జోన్ లోకి రావచ్చని దర్శకుడితో అలాగే హీరోతో కూడా చర్చించడం జరిగింది.

Gopichand seetimaar movie ott new release date

కానీ ఓటీటీకి గోపిచంద్ సంపత్ నంది అస్సలు ఒప్పుకోలేదు.ఇక చాలా రోజుల చర్చ అనంతరం ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు అయితే అనుకున్నట్లుగానే బాక్సాఫీసు వద్ద మొదటి రెండు మూడు రోజుల్లో ఓపెనింగ్స్ బాగానే అందుకుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా గోపీచంద్ సినిమా అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడంతో తప్పకుండా సినిమా చాలా తొందరగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుంటుందని అందరూ అనుకున్నారు. ఆ నమ్మకంతోనే చిత్ర యూనిట్ ముందుకు వెళ్లింది. కానీ సినిమా కలెక్షన్స్ మొదటి వారమే ఒక్కసారిగా తగ్గుతూ వచ్చాయి. మూడు రోజులు అనంతరం కోటి కంటె తక్కువ షేర్ మాత్రమే వచ్చింది. మొత్తంగా రెండు వారాల్లో సినిమా 13 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఒక విధంగా సెకండ్ వేవ్ లాక్డౌన్ అనంతరం అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాగా కూడా సిటీమార్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాకు కాస్త ఆలస్యంగా హాట్ స్టార్ లో విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి తగ్గడంతో ఈనెల 15న దసరా సందర్భంగా హాట్ స్టార్ లో విడుదల చేయబోతున్నారు. మొత్తానికి ఈ సినిమాతో నిర్మాతలు థియేట్రికల్ గా పెద్దగా లాభాలు అందుకోక పోయినప్పటికీ నాన్ థియేట్రికల్ గా మాత్రం సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. ఇక ఓటీటీలో సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ శుక్రవారం గోపీచంద్ నటించిన ఆరడుగుల బుల్లెట్ విడుదలయిన విషయం తెలిసిందే. బి.గోపాల్ దర్శకత్వం లో నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 2017 లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆర్థిక కారణాల వలన సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X