సీటీమార్ వాయిదా.. గోపీచంద్‌కు షాక్
గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో సీటీమార్ అనే సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న ఈ మూవీ రాబోతోందంటూ గ్రాండ్‌గా ఇదివరకే ప్రకటించారు. దీనికి తగ్గట్టే ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. పాటలు కూడా అందుకు తగ్గట్టే విడుదల చేశారు. డబ్బింగ్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నించారు. తమన్నా డబ్బింగ్ చెబుతున్న వీడియోలను కూడా సంపత్ నంది షేర్ చేస్తూ వచ్చాడు.
వాలు చూపుతో వయ్యారాల విందు.. సమంత హాట్ పిక్స్ వైరల్
అయితే ఈ మూవీ యూనిట్‌కు ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది. ఎంతో హైప్ క్రియేట్ చేసిన సీటీమార్ విడుదల వాయిదా పడటంతో గోపీచంద్‌కు ఎదురు దెబ్బ తగిలినట్టైంది. అయితే సీటీమార్ విడుదలను వాయిదా వేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. అంతే కాకుండా విడుదల వాయిదా ఎందుకు వేస్తున్నారో కూడా క్లారిటీగా చెప్పారు. మొత్తానికి సీటీమార్ మాత్రం ముందుగా అనుకున్నట్టు ఏప్రిల్ 2న రాబోవడం లేదు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యంగా జరుగుతుండటంతో సినిమాను అనుకున్న తేదీన తీసుకురాలేకపోతోన్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. మంచి అనుభూతిని కలిగించేందుకు ఇంకాస్త పని చేస్తున్నామని తెలిపింది. అందుకే సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయకుండా వాయిదా వేశామని అన్నారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు. మీ ఎదురుచూపులకు తగ్గ ప్రతిఫలం లభిస్తుందని భరోసా ఇచ్చారు.


Click it and Unblock the Notifications











