గోపీచంద్ ‘సీటీమార్’ రిలీజ్ డేట్ ఫిక్స్: ఓటీటీ డీల్‌పై అలా డిసైడ్ అయిన చిత్ర యూనిట్
చాలా ఏళ్ల క్రితం వచ్చిన 'లౌక్యం' అనే మూవీ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో గోపీచంద్. కెరీర్ ఆరంభం నుంచీ కమర్షియల్ సినిమాలే చేస్తూ వచ్చిన అతడు.. ఈ మధ్య విజయం కోసం తన పంథాను మార్చుకుని ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించాడు. కానీ, అవేమీ ఈ టాల్ హీరోకు సక్సెస్‌ను అందించలేదు. అయినా హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడతను. ఈ క్రమంలోనే ప్రస్తుతం గోపీచంద్.. 'సీటీమార్' అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు.
టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తోన్న చిత్రమే 'సీటీమార్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తైంది. ఇక, సినిమాను కొద్ది రోజుల్లో విడుదల చేస్తారు అనగా.. కరోనా సెకెండ్ వేవ్ వచ్చింది. దీంతో థియేటర్లు మూతపడడంతో ఈ సినిమా రిలీజ్ కూడా ఆపేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఈ చిత్రం కోసం గోపీచంద్ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

'సీటీమార్' మూవీని ఓటీటీలో విడుదల చేస్తున్నారని చాల రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఎటువంటి ప్రకటననూ చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల క్రితమే 'సీటీమార్' మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో నేరుగా విడుదల అవుతుందని ఓ న్యూస్ తెగ చక్కర్లు కొట్టింది. ఇందుకోసం ఇప్పటికే చిత్ర యూనిట్‌కు ఆ సంస్థకు మధ్య ఒప్పందం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమచారం ప్రకారం.. ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడం లేదట. త్వరలోనే దీన్ని థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని టాక్.
గోపీచంద్ నటించిన 'సీటీమార్' చిత్రానికి ఓటీటీ ఆఫర్లు వచ్చినా.. దీన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ తాజాగా నిర్ణయించుకుందట. అంతేకాదు, ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ రెండు మూడు రోజుల్లోనే వెల్లడించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై గోపీచంద్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక, ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సీటీమార్'లో గోపీచంద్‌కు జోడీగా తమన్నా నటించింది. వీళ్లిద్దరూ రెండు కబడ్డీ జట్లకు కోచ్‌లుగా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. భూమిక చావ్లా కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, ఇందులో అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. వీళ్లతో పాటు రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్యమైన రోల్స్‌లో నటించారు.


Click it and Unblock the Notifications











