twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Aaradugula Bullet Trailer: మరోసారి అలా కనిపించిన గోపీచంద్.. హై రేంజ్‌లో ఆరడుగుల బుల్లెట్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతోన్నా.. కేవలం కొన్ని విజయాలను మాత్రమే సొంతం చేసుకున్నాడు మాచో స్టార్ గోపీచంద్. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసే ఈ టాల్ హీరో.. బ్లాక్ బస్టర్ హిట్లను మాత్రం పెద్దగా ఖాతాలో వేసుకోలేకపోయాడు. కెరీర్ ఆరంభంలో చాలా విజయాలను అందుకున్న అతడు.. కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. దీంతో గోపీచంద్ గ్రాఫ్ క్రమక్రమంగా పడిపోతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో 'సీటీమార్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

    ChaySam Divorce: పెళ్లికి ముందే సమంత చైతూ మధ్య ఒప్పందం.. విడిపోయిన తర్వాత అలా చేయకూడదంటూ!ChaySam Divorce: పెళ్లికి ముందే సమంత చైతూ మధ్య ఒప్పందం.. విడిపోయిన తర్వాత అలా చేయకూడదంటూ!

    గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం 'సీటీమార్'. దీన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి దీన్ని నిర్మించారు. తమన్నా హీరోయిన్‌గా నటించగా.. భూమిక కీలక పాత్రను పోషించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఫుల్ లెంగ్త్ మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆరంభంలోనే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. కానీ, ప్రతికూల పరిస్థితులు నెలకొన్న కారణంగా క్రమంగా ఈ మూవీ కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. అయినప్పటికీ గోపీచంద్ ఖాతాలో ఓ విజయం వచ్చి చేరింది.

    Gopichands Aaradugula Bullet Movie Trailer Released

    'సీటీమార్' సినిమా ఫలితం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న గోపీచంద్.. గతంలో ఎప్పుడో చేసిన ఓ చిత్రాన్ని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని డిసైడ్ అయ్యాడు. ఆ మూవీనే 'ఆరడుగుల బుల్లెట్'. సీనియర్ డైరెక్టర్ బీ గోపాల్ తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో పూర్తైనా.. అనివార్య కారణాల వల్ల దీన్ని విడుదల చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు 'సీటీమార్'కు అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో 'ఆరడుగుల బుల్లెట్'ను రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వచ్చారు.

    అరాచకమైన డ్రెస్‌తో రెచ్చిపోయిన దిశా పటానీ: వామ్మో అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా!అరాచకమైన డ్రెస్‌తో రెచ్చిపోయిన దిశా పటానీ: వామ్మో అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా!

    ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఆరడుగుల బుల్లెట్' మూవీని అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆరంభంలో కామెడీ సీన్స్‌తో హీరో పాత్రను పరిచయం చేశారు. ఆ తర్వాత తన ఫ్యామిలీ జోలికి వచ్చిన విలన్ బ్యాచ్‌తో హీరో ఫైటింగ్‌కు రెడీ అవ్వడాన్ని హైలైట్ చేశారు. ఇక, ఇందులో బీ గోపాల్ మార్క్ ఎలివేషన్ సీన్స్‌తో పాటు పవర్‌ఫుల్ డైలాగులను కూడా చూపించారు. మొత్తంగా ఈ ట్రైలర్ చూస్తే 'ఆరడుగుల బుల్లెట్' మూవీ తండ్రి సెంటిమెంట్‌తో తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. ఇక, ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

    క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఆరడుగుల బుల్లెట్' చిత్రాన్ని జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించారు. దీనికి మణి శర్మ సంగీతం అందించారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించగా, అబ్బూరి రవి మాటలు రాశారు. ఇక, ఇందులో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా కీలక పాత్రలు పోషించారు.

    English summary
    Tollywood Talented Hero Gopichand Did Aaradugula Bullet Movie Under B Gopal Direction. Now This Movie Trailer Released
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X