twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట: అదరగొట్టిన గోపీచంద్ ‘సీటీమార్’ టీజర్

    |

    సరైన హిట్ పడక చాలా రోజులుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు టాలెంటెడ్ హీరో గోపీచంద్. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో ప్రయోగాలు చేసిన అతడు.. కెరీర్ ఆరంభంలోనే కొన్ని విజయాలను అందుకున్నాడు. అయితే, ఇటీవలి కాలంలో మాత్రం వరుసగా పరాజయాలను ఎదుర్కొంటూ సతమతం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ సంపత్ నందితో జత కట్టాడు. వీళ్లిద్దరి కలయికలో వస్తున్న చిత్రమే 'సీటీమార్'. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.

    పక్కా కమర్షియల్ జోనర్‌లో వస్తున్న 'సీటీమార్' టీజర్ కొద్ది సేపటి క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'కబడ్డి.. కబడ్డి.. కబడ్డి.. అండ్ యువర్ కౌంట్‌డౌన్ బిగిన్స్ నౌ' అంటూ విలన్ చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభం అయింది. ఆ తర్వాత కబడ్డీ జట్టు కోచ్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కనిపించింది. ఆ తర్వాత ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెబుతూ మరో కోచ్‌గా గోపీచంద్ పాత్ర దర్శనమిచ్చింది. ఇక, చివర్లో 'కబడ్డి.. మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట' అంటూ అతడు చెప్పిన డైలాగ్ ఈలలు వేసేలా ఉంది. ఇందులో మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ అవుతోంది.

    Gopichands Seetimaar​ Official Teaser Released

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను స్పోర్ట్స్ బేస్‌డ్ మూవీగా తీసుకొస్తున్నాడు సంపత్ నంది. దీని ద్వారా గోపీచంద్ చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో భూమిక చావ్లా కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, ఇందులో అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. వీళ్లతో పాటు రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    English summary
    Seetimaarr is an upcoming Indian Telugu-language sports action film directed by Sampath Nandi which stars Gopichand, Tamannaah and Digangana Suryavanshi in lead roles. The filmmakers planned a release in mid 2020, but the production was halted due to the COVID-19 pandemic. The film is scheduled to release on 2 April 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X