ప్రమోషన్ షురూ చేసిన గోపీచంద్: ‘సీటీమార్’ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్

విలన్‌గా కెరీర్‌ను ఆరంభించి.. హీరోగా సెటిల్ అయిపోయాడు టాలెంటెడ్ హీరో గోపీచంద్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న అతడు.. పక్కా కమర్షియల్ హీరోగా మంచి పేరును సంపాదించుకున్నాడు. అదే సమయంలో పరాజయాలనూ అందుకున్నాడు. 'లౌక్యం' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం అన్వేషిస్తోన్న ఈ హీరో.. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'సీటీమార్' అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టింది.

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తోన్న చిత్రమే 'సీటీమార్'. ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన టీజర్‌ను కొద్ది రోజుల క్రితం వదిలారు. పవర్‌ఫుల్ యాక్షన్‌తో వచ్చిన దానికి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అలాగే, రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. మార్చి 3వ తేదీ ఉదయం 9.46 గంటలకు టైటిల్ ట్రాక్‌ను రిలీజ్ చేస్తున్నట్లు అందులో ప్రకటించింది.

Gopichands Seetimaar​ Title Song Release date announced

గోపీచంద్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్‌గా చేస్తోంది. భూమిక చావ్లా కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, ఇందులో అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. వీళ్లతో పాటు రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక, ఈ మూవీలో గోపీచంద్ కబడ్డీ టీమ్ కోచ్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X