Seetimaarr​ మూవీ రిలీజ్‌‌పై చిత్ర యూనిట్ క్లారిటీ: ఆ లెక్కలు తేలే వరకూ డేట్ చెప్పరా!

కెరీర్ ఆరంభంలో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటినప్పటికీ.. ఈ మధ్య కాలంలో మాత్రం హిట్ లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో గోపీచంద్. అప్పుడెప్పుడో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'లౌక్యం' తర్వాత అతడు ఎన్నో చిత్రాల్లో నటించాడు. కానీ, ఇవేమీ ఈ టాల్ హీరోకు విజయాన్ని మాత్రం అందించలేదు. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. అయితే, విజయం కోసం మాత్రం అతడు ఇంకా నిరీక్షించాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి.

వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న గోపీచంద్.. తాజాగా నటించిన చిత్రం 'సీటీమార్'. టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీంతో దీన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఏర్పడిన పరిస్థితులతో 'సీటీమార్' మూవీ ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. దీంతో గోపీచంద్ అభిమానులు దీని కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

Gopichands Seetimaarr​ Movie Release in Theaters September

టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్.. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా జంటగా నటించిన 'సీటీమార్' మూవీని ఓటీటీలో విడుదల చేస్తున్నారని చాల రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఎటువంటి ప్రకటననూ చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల క్రితమే 'సీటీమార్' మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో నేరుగా విడుదల అవుతుందని ఓ న్యూస్ తెగ చక్కర్లు కొట్టింది. ఇందుకోసం ఇప్పటికే చిత్ర యూనిట్‌కు ఆ సంస్థకు మధ్య ఒప్పందం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.

గోపీచంద్ నటించిన 'సీటీమార్' మూవీని థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో ఈ మూవీ సెప్టెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు. అయితే, ఏ తేదీన వస్తుందోనన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కొద్ది రోజుల్లో పలు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. వాటికి సంబంధించిన రిలీజ్ డేట్లపై క్లారిటీ వచ్చిన తర్వాతనే 'సీటీమార్' విడుదల తేదీని ప్రకటిస్తారని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, ఇది సెప్టెంబర్ 10 విడుదలవుతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది.

'సీటీమార్‌'లో గోపీచంద్‌, తమన్నా రెండు కబడ్డీ జట్లకు కోచ్‌లుగా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. భూమిక చావ్లా కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, ఇందులో అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. వీళ్లతో పాటు రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X