twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Seetimaarr రిలీజ్ డేట్ ప్రకటన: ఆరోజు నుంచే థియేటర్లలో గోపీచంద్ సందడి

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో గోపీచంద్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఇతగాడు.. చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, 'లౌక్యం' తర్వాత మాత్రం అతడికి సక్సెస్ అందనంత దూరంలోనే ఉంటోంది. దీంతో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నా.. గోపీచంద్‌కు హిట్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడు మరోసారి తన పంథాలోకి వెళ్లి 'సీటీమార్' అనే పక్కా కమర్షియల్ సినిమాలో నటించాడు.

    ఏకాంతంగా ఒకే ఇంట్లో సినీ జంట ఎంజాయ్: అతడు బట్టల్లేకుండా.. ఆమె ప్రైవేట్ ఫొటోలు బయటకు!ఏకాంతంగా ఒకే ఇంట్లో సినీ జంట ఎంజాయ్: అతడు బట్టల్లేకుండా.. ఆమె ప్రైవేట్ ఫొటోలు బయటకు!

    అప్పట్లో ఫ్యామిలీ కథలతోనే మాస్ సినిమాలు చేస్తూ మంచి పేరును సంపాదించుకున్న దర్శకుడు సంపత్ నంది. ఇప్పుడా దర్శకుడితో గోపీచంద్ నటించిన చిత్రమే 'సీటీమార్'. చాలా కాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకున్నారు. దీంతో ఈ చిత్రాన్ని సమ్మర్‌లోనే విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది వీలు పడలేదు. దీంతో 'సీటీమార్' థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందా అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ఫలితంగా ఈ మూవీపై అంచనాలు రెట్టించాయి.

    టాలెంటెడ్ హీరో గోపీచంద్.. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా జంటగా నటించిన 'సీటీమార్' మూవీని ఓటీటీలో విడుదల చేస్తున్నారని చాల రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఎటువంటి ప్రకటననూ చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల క్రితమే 'సీటీమార్' మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో నేరుగా విడుదల అవుతుందని ఓ న్యూస్ తెగ చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా సెప్టెంబర్‌లో థియేటర్లలోకి రాబోతుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు.

    చిరంజీవి బర్త్‌డేకు బన్నీ అందుకే రాలేదు.. పవన్, చరణ్ సహా వాళ్లంతా వేస్ట్: ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలుచిరంజీవి బర్త్‌డేకు బన్నీ అందుకే రాలేదు.. పవన్, చరణ్ సహా వాళ్లంతా వేస్ట్: ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

    Gopichands Seetimaarr​ Movie Release in Theaters September 3rd

    'సీటీమార్' మూవీని సెప్టెంబర్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో హీరో గోపీచంద్ చేతిలో ఆయుధంతో ఊరమాస్ లుక్‌తో దర్శనమిచ్చాడు. దీంతో ఇన్నాళ్ల పాటు వేచి చూసిన అభిమానులు, సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. లాక్‌డౌన్ తర్వాత విడుదలయ్యే భారీ చిత్రం ఇదే కావడంతో ట్రేడ్ వర్గాలు కూడా దీనిపై బాగా ఫోకస్ చేశాయి. ఫలితంగా ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ టౌన్‌లో చర్చనీయాంశం అవుతోంది.

    'సీటీమార్‌' మూవీలో గోపీచంద్‌, తమన్నా రెండు కబడ్డీ జట్లకు కోచ్‌లుగా నటించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ మూవీని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. భూమిక చావ్లా ఇందులో కీలక పాత్రను పోషించింది. అలాగే, ఇందులో అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. వీళ్లతో పాటు రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

    English summary
    Tollywood Talented Hero Gopichand Now Doing Seetimaarr Movie Under Sampath Nandi Direction. This Movie Will Release on September 3rd in Theaters
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X