సమస్యల్లో పాతాల్ లోక్.. అనుష్క శర్మపై గుర్ఖాల కన్నెర్ర
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మాతగా మారి తెరకెక్కించిన వెబ్ సిరీస్ పాతాల్ లోక్‌కు అమెజాన్ ప్రైమ్‌లో అనూహ్యమైన స్పందన వస్తున్నది. మే 15వ తేదీన రిలీజైన ఈ సిరీస్‌పై సినీ ప్రేక్షకులు, విమర్శకులు ఈ సిరీస్ నిర్మాణం, కథ, కథనాలపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. అయితే ఈ సిరీస్‌లోని రెండో ఎపిసోడ్‌లో గుర్ఖా కమ్యూనిటీ మనోభావాలను దెబ్బ తీసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉండటం వివాదానికి దారి తీసింది.
కొన్ని సీన్లు తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ గుర్ఖా కమ్యూనిటీ ఆన్‌లైన్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఆ సీన్లు కనిపించకుండా బ్లర్ చేయాలని, ఆ సీన్లలో డైలాగ్స్ వినిపించకుండా మ్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రత్యేకంగా క్షమాపణ చెప్పినట్టు పేర్కొనాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ మేరు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ సిరీస్ ప్రొడ్యూసర్ అనుష్క శర్మకు నోటీనులు పంపారు.

పాతాల్ లోక్ వివాదంపై భారతీయ గోర్ఖా యువ పరిషత్ నేత స్పందిస్తూ.. మా నేపాలి కమ్యూనిటీని కించపరిచే విధంగా చూపించారు. జాతి వివక్షను ఉద్దేశించేలా సీన్లు చిత్రీకరించారు అని పేర్కొన్నారు. లైంగిక, జాతి వివక్ష చర్యలు మానుకోవాలని ఆయన సూచించారు.


Click it and Unblock the Notifications











