భర్త చేతిలో అలా మోసపోయా... అమ్మాయిలతో హీరో ఎఫైర్లపై భార్య రియాక్షన్

బాలీవుడ్ సూపర్‌స్టార్ గోవిందా ఆయన సతీమణి సునీతా ఆహుజాల వైవాహిక బంధం, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది. గత కొద్దినెలలుగా ఈ స్టార్ కపుల్ విడాకుల న్యూస్‌ బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. వీటిపై ఇద్దరూ ఖండించడం, మళ్లీ విడాకుల ప్రస్తావన రావడం షరా మామూలైపోయింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న లాకప్ 2 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న సునీతా అహుజా తన భర్త గోవిందా, ఆయన అక్రమ సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

లాకప్ 2: సచ్ యే సజా పేరుతో సెకండ్ సీజన్ జూన్ 27 నుంచి లాంచ్ అయ్యింది. ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్‌లు తాజా సీజన్‌కు హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. తాజా సీజన్‌లో మొత్తం 15 మంది ఇన్‌మేట్స్ పాల్గొంటున్నారు. వీరిలో బుల్లితెర నుంచి రామ్ కపూర్, శివంగి జోషి, ధీరజ్ ధూపార్, హర్షద్ చోప్డా.. డిజిటల్ క్రియేటర్స్ కేటగిరి నుంచి రియాజ్ అలీ, సూఫి మోతివాలా, ఆకాంక్ష చమోలా, ఆకాంక్ష చౌదరి.. రియాలిటీ స్టార్స్ కేటగిరీ నుంచి సునీతా అహుజా, ప్రమీలా సెరెనా, శ్రేయా కల్రా, యోగేష్ రావత్‌లు పాల్గొంటున్నారు.

Govinda s Wife Sunita Ahuja Makes Shocking Claims About His extra marital affairs on Lock Upp 2

ఎలాంటి ఉద్దేశం అయినా సరే కుండబద్ధలు కొట్టడం సునీత స్టైల్. ఇలాంటి వ్యక్తులే లాకప్ 2 వంటి రియాలిటీ షోలకు కావాలి కూడా. తాజాగా లాకప్ 2 నాలుగవ ఎపిసోడ్‌లో భాగంగా భర్త నమ్మకద్రోహం గురించి గతంలో సునీత చేసిన వ్యాఖ్యలపై శ్రేయా కల్రా ప్రశ్నించారు. దీనిపై సునీత స్పందిస్తూ.. మా వైవాహిక బంధంలో నమ్మక ద్రోహం అనేది మొదటి నుంచే ఉంది. అతను హీరో కాబట్టి ఆయనను ఏమీ అనలేం. ఈ వయసులో దీని గురించి ఆలోచిస్తే నా డయాబెటీస్ ఇంకా పెరుగుతుంది. పరిస్ధితుల్ని ఇలాగే కొనసాగనివ్వాలని నిర్ణయించుకున్నాను, బాధగా ఉన్నప్పటికీ నా పిల్లల కోసమే జీవిస్తున్నానని సునీత వెల్లడించారు.

గోవిందాకు ఇంకా మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయా అని తోటి కంటెస్ట్ ప్రశ్నించగా.. ఎవరినైనా మనం ఆపగలమా? 24 గంటలూ ఆయన కళ్ల ముందే కూర్చొని ఉండాలా? అలా చేస్తే మనపై అవతలి వ్యక్తికి చిరాకు వస్తుంది. అసలు ఆ విషయం గురించి ఆలోచించకుండా ముందు సాగిపోతుంటాను. గోవిందాకు రెండు ఇళ్లు ఉన్నాయి. ఒకదానిలో నేను, మరో దానిలో గోవిందా నివసిస్తున్నారు. 40 ఏళ్ల క్రితం వివాహేతర సంబంధాల గురించి ఎవరు పట్టించుకున్నారు? ఆయన ఇన్నేళ్లలో లెక్కలేనన్ని ప్రేమ వ్యవహారాలు నడిపించాడు. మమ్మల్ని మౌనంగా ఉండమని, చనిపోయాక తప్పించి ఆ ఇంటిని వదిలి వెళ్లకూడదని నేర్పించారని సునీత వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి.

కాగా.. బాలీవుడ్‌‌లో కామెడీ, ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు గోవిందా. కపూర్లను, ఖాన్ త్రయాన్ని ఎదుర్కొని తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 80, 90వ దశకాలలో వరుస హిట్స్‌తో అమ్మాయిల్లో, కుటుంబ ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సునీతతో ప్రేమలో పడిన గోవిందా 1987లో ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగా ఈ విషయం బయటపడితే తన సినీ జీవితానికి ఇబ్బంది అని భావించిన వీరిద్దరూ నాలుగేళ్ల పాటు ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచారు. చివరికి కుమార్తె టినా అహుజా పుట్టిన తర్వాత తమకు పెళ్లయినట్లు సునీత- గోవిందాలు అధికారికంగా ప్రకటించారు.

అయితే గత కొంతకాలంగా సునీత- గోవిందాల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నట్లుగా బాలీవుడ్ కోడై కూసింది. మీడియాలోనూ రకరకాల కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో గోవిందా నుంచి తనకు విడాకులు కావాలంటూ సునీత పిటిషన్ దాఖలు చేయడం అభిమానులను, సినీ ప్రముఖులను షాక్‌కు గురిచేసింది. అక్రమ సంబంధాలు, శారీరక, మానసిక హింస వంటి ఆరోపణలు చేయడం మరింత రచ్చకు దారి తీసింది. ప్రస్తుతం గోవిందా ముంబైలోని ఓ బంగ్లాలో ఉంటుండగా, సునీత ఆ ఎదురుగా ఉండే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు.

Read more about: govinda sunita ahuja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X