ఆ దేశంలో కూడా ‘మహాసముద్రం’ రిలీజ్: అక్కడ ఒకరోజు ముందే విడుదల కానున్న మూవీ
కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పడు ప్రేక్షకుల అభిరుచిలో తేడా కనిపించడంతో ఈ తరహా చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. దీంతో హీరోలు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. వాళ్లకు అనుగుణంగానే దర్శక నిర్మాతలు కూడా మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో చాలా మూవీలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో మరిన్ని మల్టీస్టారర్ ప్రాజెక్టులు భారీ స్థాయిలో రూపొందేలా పట్టాలెక్కుతున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలు రూపొందుతున్నాయి. అందులో 'మహాసముద్రం' ఒకటి. RX100 వంటి ప్రయోగాత్మక చిత్రంతో ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో టాలెంటెడ్ హీరో శర్వానంద్, హ్యాండ్సమ్ గాయ్ సిద్దార్థ్ కలిసి నటిస్తున్నారు. సున్నితమైన ప్రేమకథకు భారీ స్థాయిలో భావోద్వేగాలను జోడించి దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.
వాస్తవానికి 'మహాసముద్రం' చిత్రాన్ని పెద్ద స్టార్లతోనే తీయాలని దర్శకుడు అజయ్ భూపతి భావించాడు. కానీ, అది సాధ్య కాకపోవడంతో శర్వానంద్, సిద్ధార్థ్‌తో దీన్ని తెరకెక్కించాడు. ఎప్పుడో మొదలైన ఈ చిత్ర షూటింగ్.. సెకెండ్ వేవ్ తర్వాత అంటే ఇటీవలే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మొదలెట్టి దాదాపుగా కంప్లీట్ చేసేశారు. ఇటీవలే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. అలాగే, ఇటీవలే రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఇక, ఈ మూవీని అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ప్రకటన వెలువడింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'మహాసముద్రం' మూవీకి అన్ని ఏరియాల్లోనూ భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కూడా భారీ ధరకే అమ్ముకున్నారు. ఇక, తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ సంస్థ దక్కించుకుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ట్విట్టర్‌లో 'గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ సంస్థతో కలిసినందుకు సంతోషంగా ఉంది. అక్టోబర్ 13న ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌ను ప్లాన్ చేశారు' అని పేర్కొంది. దీంతో ఈ చిత్రం అమెరికాలో భారీగా రిలీజ్ కాబోతుందని తెలిపింది.
శర్వానంద్, సిద్ధార్థ్ కాంబినేషన్‌లో వచ్చిన 'మహాసముద్రం' సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కించాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇద్దరు స్నేహితుల మధ్య ప్రేమ చిచ్చు పెట్టి.. వాళ్లను శత్రువులుగా మార్చేసిందన్న కాన్సెప్టుతో ఇది తెరకెక్కినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఎమోషనల్‌గా సాగే ఈ సినిమాలో అదితి రావ్ హైదరీతో పాటు అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతి దానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.


Click it and Unblock the Notifications











