Tiger Nageshwara Rao: టైగర్ నాగేశ్వర రావు సినిమా ఆఫీసుపై జీఎస్టీ, ఐటీ దాడులు..
Tiger Nageshwara Rao: టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ హీరోగా చేస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వర రావు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రాన్నిఅభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగరర్వాల్ నిర్మించారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ఆఫీసుపై ఐటీ అధికారులతో పాటు జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం రోజు ఉదయం హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంతో పాటు ఇంట్లోనూ సోదాలు చేశారు. లావాదేవీలు, పన్ను చెల్లింపుల రికార్డులను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.
నిర్మాత అభిషేక్ అగర్వాల్ 2018వ సంవత్సరం నుంచి ప్రొడ్యూసర్ గా మారారు. కిర్రాక్ పార్టీ చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అనిల్ సుంకరతో కలిసి చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత సీత అనే సినిమాకు కూడా వీరిద్దరూ కలిసి పని చేశారు. టీడీ విశ్వప్రసాద్ తో కలిసి గూడాచారి, ఏ1 ఎక్స్ ప్రెస్, కార్తికేయ 2, రాజరాజ చోర, ధమాకా వంటి చిత్రాలను తెరకెక్కించారు. సొంతంగా కశ్మీర్ ఫైల్స్ పాన్ ఇండియా చిత్రాన్ని కూడా నిర్మించారు.

అయితే ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో కలిసి టైగర్ నాగేశ్వర రావు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ లు హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. నాజర్, మురళీ శర్మ, రేణు దేశాయ్ వంటి వారు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నారు. నూతన డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా విడుదల అవుతుందనగా.. ప్రొడ్యూసర్ ఆఫీసుపై సోదాలు జరగడనం సంచలనంగా మారింది. చూడాలి మరి ఈ ప్రొడ్యూసర్ ఎలా బయటకు వస్తారనేది.


Click it and Unblock the Notifications











