twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ సుమ, అనసూయకు జీఎస్టీ అధికారుల షాక్.. లావణ్య త్రిపాఠి ఇంట్లోనూ తనిఖీలు

    |

    రీసెంట్‌గా నాని, రామానాయుడు, సురేష్ ప్రొడక్షన్స్‌లో జరిగిన ఐటీ దాడులు మరిచిపోక ముందే మరొ కొంతమందికి షాక్ తగిలింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి, యాంకర్ సుమ, అనసూయలకు జీఎస్టీ అధికారుల సెగ తగిలింది. వీరందరి ఇళ్లలో కేంద్ర జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. జీఎస్టీ పన్నులను ఎగవేశారనే ఆరోపణలతో వీరిపై రైడ్ చేసినట్టు సమాచారం.

    ఏకకాలంలో దాడులు..

    ఏకకాలంలో దాడులు..

    కోట్ల రూపాయల జీఎస్టీని ఎగవేసినట్టు ఆరోపణలున్న నేపథ్యంలో ఏకకాలంలో 23 చోట్ల దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. స్థిరాస్థి, చిత్ర రంగం, మీడియా, చిట్ ఫండ్, సాఫ్ట్ వేర్, నిర్మాణ రంగం ఇలా అన్నింటిపైనా దాడులు చేశారు. వీటిలో చిత్ర రంగం నుంచి లావణ్య త్రిపాఠి, యాంకర్ సుమ, అనసూయ భరద్వాజ్ ఉన్నట్లు తెలుస్తోంది.

    ఫుల్ బిజీగా ఉండే యాంకర్లు..

    ఫుల్ బిజీగా ఉండే యాంకర్లు..

    బుల్లితెరను కొన్నేళ్లుగా ఏళుతున్న యాంకర్ సుమ.. రెమ్యూనరేషన్ ఏరేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర షోలతో కాకుండా.. ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటూ క్షణం తీరిక లేకుండా ఉండే సుమ ఆస్తులు, పెట్టుబడులపై జీఎస్టీ అధికారులు కన్నేసినట్టు తెలుస్తోంది. బుల్లితెర, వెండితెర అంటూ రెండు చేతులా సంపాదిస్తోంది అనసూయ భరద్వాజ్. వీరంతా వేరే సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. వాటికి చెల్లించాల్సిన సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీలను చెల్లించడం లేదని సమాచారం.

    లావణ్య త్రిపాఠి ఇంట్లో తనిఖీలు..

    లావణ్య త్రిపాఠి ఇంట్లో తనిఖీలు..

    రూ. కోట్లలో సర్వీస్‌ ట్యాక్స్‌ ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) అధికారులు జూబ్లిహిల్స్‌లోని లావణ్య త్రిపాఠి ఇంటిపై శుక్రవారం దాడులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న లావణ్య సినిమా షూటింగ్‌ను రద్దు చేసుకుని ఇంటికి చేరుకుంది. ఈమె కూడా పలు ప్రైవేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిందని, వాటికి సంబంధించిన ట్యాక్స్‌ను ఎగవేసినట్టు ఆరోపణలు చేస్తున్నారు.

    గత నెలలో ఐటీ రైడ్స్..

    గత నెలలో ఐటీ రైడ్స్..

    హీరో నాని, సురేష్ బాబు ప్రొడక్షన్స్, వెంకటేష్ నివాసం ఇలా కొందరు సెలెబ్రిటీలపై ఐటీ అధికారుల కన్ను పడింది. నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌లోనూ ఐటీ దాడులు జరిగినట్టు వార్తలు వచ్చినా.. వాటిపై నాగ్ సీరియస్‌గా స్పందించాడు. అలాంటివేమీ జరగలేదని వివరణ ఇచ్చాడు.

    English summary
    GST Raids On Lavanya Tripathi, Anasuya And Anchor Suma. They Are Invested In Private Companies. They Are Not Paying GST For Theie Investmnets And Profits.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X