GST Trailer: మంత్రి శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా.. జూనియర్ సంపూ రంగంలోకి!
తోలు బొమ్మల సిత్రాలు" బ్యానర్‌పై కొమారి జానకి రామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం GST (గాడ్, సైతాన్, టెక్నాలజీ). ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. GST చిత్ర యూనిట్‌కు బెస్టాఫ్ లక్ చెప్పారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ మూవీ టైటిల్ చాలా బాగుంది. డైరెక్టర్ చెప్పిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. మంచి సందేశం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ చిత్రం భారీ విజయం అందుకోవాలి. డైరెక్టర్ కొమారి జానకిరామ్ దర్శకుడిగా మంచి పేరు సంపాదించాలి అని యూనిట్ సభ్యులుకు అభినందనలు తెలిపారు.
జూనియర్ సంపు మాట్లాడుతూ.. GST మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాం. ఓటీటీలో రిలీజ్ చేయమని డైరెక్టర్‌ను రిక్వెస్ట్ చేశాం. కానీ డైరెక్టర్ ఈ సినిమా క్వాలిటీ గాని, కంటెంట్ గాని, సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న సినిమాను థియేటర్లో చూస్తేనే మంచి ఫీలింగ్ ఉంటుంది. అందుకోసమే థియేటర్లలో త్వరలోనే రిలీజ్ చేస్తున్నాం అని అన్నాడు.

హీరోయిన్ స్వాతి మండల్ మాట్లాడుతూ.. మా చిత్రం ట్రైలర్‌ను సినిమాటోగ్రఫి మంత్రి ట్రైలర్ లాంచ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. గాడ్ సైతాన్ టెక్నాలజీ పోస్టర్‌ను చూస్తే.. మీరు హార్రర్ మూవీ అనుకుంటారు. కానీ ఇందులో లవ్, కామెడీ, రొమాన్స్, హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్‌తోపాటు అన్ని అంశాలు ఉంటాయి. నేను హీరోయిన్‌గా కీలక పాత్రలో కనిపిస్తాను అని అన్నారు.
దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ.. మా తోలు బొమ్మల సిత్రాలు బ్యానర్‌పై నిర్మించిన గాడ్, సైతాన్, టెక్నాలజీ చిత్రం కాన్సెప్ట్‌ను మంత్రి శ్రీనివాసయాదవ్‌కు చెబితే చాలా హ్యాపీగా ఫీలయ్యారు. వెంటనే ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఒప్పకొని మమ్మల్ని ఆశీర్వదించారు. అందుకోసం మంత్రి గారికి మా చిత్ర యూనిట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని అన్నారు.
అశోక్ మాట్లాడుతూ.. GSTట్రైలర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. సైన్స్‌లో ఒక కొత్త పాయింట్‌ని తీసుకొని సృష్టిలో ఏది నిజం? దేవుడా, దయ్యమా?, అని దర్శకుడు కొమారి జానకిరామ్ తెరకెక్కించారు. పలువురు దర్శకుల వద్ద పనిచేసిన అనుభవంతో సరికొత్త అంశంతో ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించడం గ్యారెంటి అని అన్నారు..
నటీనటులు: ఆనంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందు, స్వాతిమండల్, యాంకర్ ఇందు, పూజా సుహాసిని, వాణి, జూనియర్ సంపు, స్వప్న,శ్రష్టి వర్మ, వేదం నాగయ్య, గోవింద్,నల్లి సుదర్శన రావు, జానపదంఅశోక్, సూర్య,సంతోష్, రమణ తదితరులు
నిర్మాత: కొమారి జానయ్య నాయుడు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: కొమారి జానకిరామ్
ఎడిటింగ్: సునీల్ మహారాణా
డివోపీ: డి యాదగిరి
సంగీతం: యువీ నిరంజన్
లైన్ ప్రొడ్యూసర్: కే బాలకృష్ణ
పిఆర్వో: మధు వీఆర్


Click it and Unblock the Notifications











