మాస్ జాతరలో పవర్‌ఫుల్ లేడీ.. రవితేజను డామినేట్ చేసేలా.. ఈ లేడీ సింగం ఎవరు?
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్‌టైన్‌మెంటే. పంచ్‌లు, కామెడీ, ఫైట్స్, పాటలతో పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో ప్రేక్షకులకు విందు భోజనం పెడతారు రవితేజ. అందుకే ఆయన సినిమాలకు అంతటి క్రేజ్. తాజాగా మాస్ మహారాజా నటించిన చిత్రం మాస్ జాతర. రవితేజ నట జీవితంలో ఇది 75వ సినిమా కావడంతో మాస్ జాతరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పలువురు నటీనటులు నటించారు. వీరిలో ఒక లేడీ పాత్ర ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్స్‌కు దారి తీసింది. ఈ వివరాల్లోకి వెళితే..
మాస్ జాతర తారాగణం
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ మాస్ జాతర సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఇందులో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర విలన్ రోల్ పోషిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రవీణ్, హిమజ, వీటీవీ గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. విదు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, రవితేజ గెటప్, లుక్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

గంజాయి స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో
మాస్ జాతరలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కినట్లుగా ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. ప్రారంభంలోనే కేజీ, రెండు కేజీలు కాదురా... ఇరవై టన్నులు, రాత్రికి రాత్రే సరకుని బండిలో ఎక్కించండి అనే డైలాగ్ వినిపిస్తుంది. ఈ గంజాయి స్మగ్లింగ్ గ్యాంగ్‌కు నవీన్ చంద్ర నాయకుడు అని అర్ధమవుతోంది. అతని దందాను ఎదిరించి ఆట కట్టించే పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ నటించినట్లుగా చెబుతున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఆసక్తికరంగా ఉంటాయని ఫిలింనగర్ టాక్.
ఆ స్క్రీన్ షాట్ వైరల్
ఇదిలాఉండగా.. ఈ సినిమాలో ఓ నటికి పవర్‌ఫుల్ రోల్ ఇచ్చినట్లుగా ట్రైలర్‌ను చూస్తే అర్ధమవుతోంది. ఈరోజు సినిమా రిలీజ్ కావడంతో ట్రైలర్‌లోని ఆ షాట్‌ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న రవితేజ ఫ్యాన్స్... ఆమె ఎవరో కనుక్కోండి అంటూ సవాల్ విసురుతున్నారు. ట్రైలర్‌లో విలన్ నవీన్ చంద్ర, రవితేజ కలుసుకునే సీన్‌లో లక్ష్మణ్ అంటే రాముడి బ్రదర్, అర్ధ ఆయుష్సుతో పోతే ఆంజనేయుడు బతికించిన క్యారెక్టర్.. ఇక్కడ సంజీవనీ లేదు, ఆంజనేయుడు రాడు. ఇది ఇక్కడ పోలమ్మ జాతరకు శత్రువుల్ని బలి ఇవ్వడం నా ఆనవాయితీ అని రవితేజకు దిష్టి తీసి బొట్టు పెడతాడు. ఈసారి నేను నిన్ను బలి ఇస్తున్నానని అంటాడు.
ఆ నటి ఎవరు?
అందులోనే గాయాలతో పడి ఉన్న రవితేజను కదలకుండా ఓ మహిళ, మరో వ్యక్తి పట్టుకుంటారు. ఆ తర్వాత సీన్‌లో అదే మహిళ గాల్లో ఎగురుకుంటూ వచ్చి రవితేజను కత్తితో నరుకుతుంది. దీంతో ఆ మహిళ ఎవరు? రవితేజను ఎందుకు చంపాలని అనుకుంది? ఆవిడ ఎవరి తాలుకా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చాలామంది ఆ నటిని బిగ్‌బాస్ కంటెస్టెంట్ హిమజగా భావిస్తున్నారు. మరికొందరు నవ్య స్వామి అని.. విక్రమ్ మూవీలో ఉన్న లేడీ ఏజెంట్ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఆ నటి ఎవరు అనేది తెలియాలంటే మాస్ జాతర సినిమా చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











