Karthikeya 2 టీమ్ భేష్.. కృష్ణుడి కథతో మెప్పించారు.. గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ ప్రశంసల వర్షం
దక్షిణాదితోపాటు హిందీలో కూడా కాసుల వర్షాన్ని కురిపిస్తున్న కార్తీకేయ 2 చిత్రంపై సాధారణ ప్రేక్షకుల నుంచి ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమాకు ఉత్తరాదిలో బ్రహ్మండమైన రెస్సాన్స్ లభిస్తున్నది. ఈ సినిమాపై పవన్ కల్యాణ్, ఇస్కాన్ ఆలయ నిర్వాహకులు ప్రశంసలే కాకుండా చిత్ర యూనిట్‌ను అభినందించారు.
తాజాగా కార్తీకేయ 2 చిత్రానికి అండగా నిలిచిన వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ చేరారు. ఈ సినిమా యూనిట్ ఇటీవల అహ్మదాబాద్‌లో గుజరాత్ సీఎంను కలిశారు. నిఖిల్, నిర్మాత, దర్శకులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

కార్తీకేయ 2 సినిమాను చూసిన భూపేంద్రభాయ్ పటేల్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. వెండితెరపై కృష్ణ భగవానుడిని అధ్యాత్మికంగా చూపించడం అభినందనీయం అని అన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోనే సినిమాను చిత్రీకరించామనే విషయాన్ని గుజరాత్ సీఎం దృష్టికి తీసుకు రావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు అని యూనిట్ సభ్యులు తెలిపారు.
కార్తీకేయ 2 సినిమా కలెక్షన్ల విషయానికి వ్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం గత 18 రోజుల్లో 30 కోట్ల షేర్, 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం 2.55 కోట్ల షేర్ సంపాదించింది. ఓవర్సీస్‌లో 5.55 కోట్ల షేర్ రాబట్టింది. ఉత్తర భారతదేశంలో 11.5 కోట్లకుపైగా షేర్,20 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











