twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2 టీమ్ భేష్.. కృష్ణుడి కథతో మెప్పించారు.. గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ ప్రశంసల వర్షం

    |

    దక్షిణాదితోపాటు హిందీలో కూడా కాసుల వర్షాన్ని కురిపిస్తున్న కార్తీకేయ 2 చిత్రంపై సాధారణ ప్రేక్షకుల నుంచి ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమాకు ఉత్తరాదిలో బ్రహ్మండమైన రెస్సాన్స్ లభిస్తున్నది. ఈ సినిమాపై పవన్ కల్యాణ్, ఇస్కాన్ ఆలయ నిర్వాహకులు ప్రశంసలే కాకుండా చిత్ర యూనిట్‌ను అభినందించారు.

    తాజాగా కార్తీకేయ 2 చిత్రానికి అండగా నిలిచిన వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ చేరారు. ఈ సినిమా యూనిట్‌ ఇటీవల అహ్మదాబాద్‌లో గుజరాత్ సీఎంను కలిశారు. నిఖిల్, నిర్మాత, దర్శకులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

    Gujarat CM Bhupendrabhai Patel congratulates Karthikeya 2 team in Ahmedabad

    కార్తీకేయ 2 సినిమాను చూసిన భూపేంద్రభాయ్ పటేల్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. వెండితెరపై కృష్ణ భగవానుడిని అధ్యాత్మికంగా చూపించడం అభినందనీయం అని అన్నారు. ఈ సందర్భంగా గుజరాత్‌ రాష్ట్రంలోనే సినిమాను చిత్రీకరించామనే విషయాన్ని గుజరాత్ సీఎం దృష్టికి తీసుకు రావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు అని యూనిట్ సభ్యులు తెలిపారు.

    కార్తీకేయ 2 సినిమా కలెక్షన్ల విషయానికి వ్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం గత 18 రోజుల్లో 30 కోట్ల షేర్, 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం 2.55 కోట్ల షేర్ సంపాదించింది. ఓవర్సీస్‌లో 5.55 కోట్ల షేర్ రాబట్టింది. ఉత్తర భారతదేశంలో 11.5 కోట్లకుపైగా షేర్,20 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

    English summary
    Gujarat state Chief Minister Bhupendrabhai Patel recently watched the film and was mesmerised by the team's efforts in bringing Lord Krishna's teaching to screen. The film was mostly shot in Gujarat state and is now sweeping the country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X