2023 Oscar బరిలో ఆ చిన్న సినిమాకు లక్కీ ఛాన్స్.. RRR ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్!

2023 ఆస్కార్స్‌లో తప్పకుండా RRR సినిమా పోటీగా నిలుస్తుందిని చాలామంది సినీ ప్రముఖులు కూడా నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక అభిమానులు సైతం సోషల్ మీడియాలో ఎంతో హడావుడిగా ఆస్కార్ భరిలో RRR ఉండాల్సిందే అని కోరుకున్నారు. ఇక పలు ఇంగ్లీషు మ్యాగజైన్ లు సైతం RRR సినిమా డిమాండ్ ను బట్టి ఆస్కార్స్ లో ఉండవచ్చని ఉహించారు. కానీ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీ మరో సినిమాను సెలెక్ట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

RRR సినిమాతో పాటు ది కాశ్మీర్ ఫైల్స్ కూడా ఆస్కార్ భరిలో ఉండవచ్చని అందరు అనుకున్నారు. కానీ ఆ రెండు సినిమాలను కాకుండా గుజరాతీ కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా తరహాలో వచ్చిన సినిమాను సెలెక్ట్ చేశారు. పాన్ నలిన్ దర్శకత్వంలో 'ఛెలో షో' 2023 ఆస్కార్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీ ఈ సినిమాను ఎంపిక చేసింది.

Gujarati film Chhello Show is Indias official Oscars entry and RRR fans upset

కన్నడ దర్శకుడు టీఎస్ నాగభరణ నేతృత్వంలోని కమిటీ కొద్ది రోజుల క్రితం చెన్నైలో సమావేశమైంది. ఇక ఈ పోటీలో SS రాజమౌళి RRR, వివేక్ అగ్నిహోత్రి యొక్క ది కాశ్మీర్ ఫైల్స్, సాజిమోన్ ప్రభాకర్ యొక్క మలయంకుంజు, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు చర్చల్లోకి వచ్చాయి. ఇక కమిటీ నిర్ణయంతో 'ఛెలో షో' ను ఫైనల్ చేసినట్లు FFI సెక్రటరీ జనరల్ సుప్రాన్ సేన్ ఒక ప్రముఖ వెబ్ మీడియాకు తెలిపారు. ప్రతి సంవత్సరం అందజేసే అకాడమీ అవార్డ్స్ వేడుక 2023 మార్చి 12 జరుగుతుంది.

ఇక జూన్‌లో జరిగిన ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఛెలో షో సినిమా ప్రదర్శించబడింది. అక్టోబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం గుజరాత్ గ్రామీణ ప్రాంతంలోని డైరెక్టర్ నలిన్ బాల్యం నుండి ప్రేరణ పొందిందట. ఇక RRR సినిమాను ఆస్కార్ నామినేషన్ కు సెలెక్ట్ చేయకపోవడంపై అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా విదేశాల్లో కూడా మంచి క్రేజ్ అందుకుంది. చాలామంది హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు తప్పకుండా ఆస్కార్ బరిలో నిలిస్తే ప్రపంచ స్థాయిలో ఇండియన్ సినిమాకు గుర్తింపు వస్తుంది అని అందరూ ఆశించారు. కానీ అలా నామినేట్ కాకపోవడంతో ఫ్యాన్స్ అయితే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X