For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్‌‌లో మరో ఇద్దరు వారసుల ఎంట్రీ: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కొడుకు హీరోగా,దర్శకుడిగా గల్లీ గ్యాంగ్

  |

  తెలుగు సినిమా పరిశ్రమకు మరో వారసుడు పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎందరో ప్రముఖులు కుమారులు, కుమార్తెలు రాణిస్తున్న తరుణంలో ప్రముఖ సాంకేతిక నిపుణుడు, సినిమాటోగ్రాఫర్ టీ సురేంద్రరెడ్డి తనయుడు టాలీవుడ్‌లో పూర్తిస్థాయి హీరోగా కనిపించబోతున్నారు. తాజాగా తన కుమారుల్లో ఒకరిని దర్శకుడిగా, మరొకరిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ గల్లీ గ్యాంగ్ రూపొందించారు. ఆ విషయాన్ని తన అభిమానులు, సినీ ప్రేక్షకులతో పంచుకొన్నారు.

  నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అధినాయకుడు, శ్రీమన్నారాయణ అలాగే, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ నలుగురు, జగపతి బాబు హీరోగా చేసిన పెళ్ళైన కొత్తలో చిత్రాలతోపాటు జై బోలో తెలంగాణ, గరం, 10th క్లాస్, మైసమ్మ IPS లాంటి సినిమాలకు, దాదాపు 50 పైగా చిత్రాలకు ఛాయాగ్రహణం సమకూర్చారు. అలాగే హిందీలో రుద్రాక్ష్, టాంగో చార్లీ, కన్నడం లో విష్ణువర్థన్ హీరో గా కుంతీ పుత్ర చిత్రాలకుకూడా ఫోటోగ్రఫీ అందించారు.

  Gully Gang getting ready for release

  సినిమాటోగ్రాఫర్ టీ సురేంద్రరెడ్డి వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయనకు ఇద్దరు కవల పిల్లలు. ఒకరు వినయ్ తంబిరెడ్డి, సమీర్ దత్త. వీళ్లల్లో వినయ్ తంబిరెడ్డి దర్శకుడిగా, సమీర్ దత్త హీరోగా ఓ చిత్రం రూపొందింది. మూవీ బీస్ పతాకంపై తనయులు రూపొందించిన గల్లీ గ్యాంగ్ ఈ చిత్రానికి తండ్రి సురేంద్రరెడ్డి పర్యవేక్షణ చేయడం విశేషం.

  దర్శకుడు వినయ్ తంబిరెడ్డి మాట్లాడుతూ ఇంజినీరింగ్ పూర్తయ్యాక చెన్నైలో మైండ్స్క్రీన్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్‌లో డైరెక్షన్ కోర్సు చేశాను. ఆ తరువాత జెస్సీ, కృష్ణ అండ్ హిజ్ లీల, రాధాకృష్ణ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేశాను. తెలంగాణ యాసతో పల్లెటూరి చిక్కటి ప్రేమకథగా కుమార్ మల్లారపు రాసిన స్క్రిప్ట్ గల్లీ గ్యాంగ్‌తో దర్శకునిగా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో అందరూ కొత్త వాళ్లే నటించారు.

  Gully Gang getting ready for release

  గల్లీ గ్యాంగ్ చిత్రంలో ప్రత్యేక పాత్రను మాత్రం సీనియర్ హాస్య నటులైన జెన్నీతో చేయించాం. 20 రోజులపాటు గోదావరిఖని పరిసర ప్రాంతాల్లో నటీనటుల్ని ఎంపిక చేసి, వాళ్లకు వర్క్‌షాప్ నిర్వహించాం. తెలంగాణ సాంస్కృతిక సమితి రాష్ట్ర సమన్వయ కర్త దయా నర్సింగ్ సహకారంతో రామగుండం, పెద్దంపేట్ గ్రామాల్లో 40 రోజులపాటు షూటింగ్ చేశాం. సాంకేతిక నిపుణులు కూడా అంతా కొత్త వారే. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకుతీసుకు వస్తాం అని తెలిపారు.

  హీరోగా నటించిన సమీర్ దత్త మాట్లాడుతూ.. నేను ముంబై, అలాగే రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో నటనలో శిక్షణ పొందాను. రంగు సినిమాలో తొలిసారిగా బండి శీను పాత్ర చేశా. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన 2 ఫ్రెండ్స్ చిత్రంలో హీరోఫ్రెండ్‌గా, సూపర్ స్కెచ్‌లో విలన్ పాత్రలో కనిపించాను. తాజాగా గల్లీ గ్యాంగ్ చిత్రం ద్వారా నేను హీరో‌గా ప్రేక్షకులకి దగ్గరవుతాననే నమ్మకం ఉంది అని చెప్పారు.

  Gully Gang getting ready for release

  నటీనటులు:
  సమీర్ దత్త, భూమిక, ప్రకాశరావు, మల్లికార్జున్ శ్రీరాములు, శ్రావణ్ కుమార్, బాలు బ్రహ్మ, దశరథ్, కూన మల్లేష్, సంతోష్ జక్కుల, ఫారూఖ్, లక్ష్మి కాంత్, దయా నర్సింగ్, భవాని, విజయభాస్కర్, కుష్భూ, ప్రణవి, సింధు, సుదీక్ష ఝా, అమ్ములు, శ్వేత, జెన్నీ తదితరులు
  ఆర్ట్: హర్ష
  కథ-మాటలు: కుమార్ మల్లారపు
  యాక్షన్: ఆనంద్రాజ్
  ఎడిటింగ్: శివ సర్వాణి
  సినిమాటోగ్రఫీ‌: రాజేష్ అవల
  సంగీతం: కందికట్ల రామకృష్ణ
  బ్యాక్ గ్రౌండ్ స్కోర్: కృష్ణ సాయి, ప్రవీణ్ ఇమ్మడి
  ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముక్తేవి ప్రకాశరావు

  English summary
  Tollywood's popular Cinematographer T Surendra Reddy introducing his sons Vinay Tambi Reddy and Sameer Datta to film industry. Vinay Tambi Reddy as director and Sameer Datta as hero Gully Gang getting ready for release.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X