‘గుణ 3689’ ట్రైలర్... కార్తికేయ పెర్పార్మెన్స్ అదుర్స్!
కార్తికేయ, అనఘ జంటగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గుణ 369. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు.
ఆగస్ట్ 2న ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ''మన అనుకున్నవాళ్లు బావుండాలంటే ప్రపంచంలో ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో చెప్పి పెట్టాలిరా గుణ'' అనే డైలాగుతో ట్రైలర్ మొదలైంది.

''నేను ఎడారిలో ఉన్నా... గొంతు ఎండిపోతోంది... కొన్నే నీళ్లు దొరికాయి.. ఇవి మంచివా? చెడ్డవా అని ఆలోచించే ఓపిక, తీరిక నాకు లేదు... తాగి దాహం తీర్చుకోవడమే.'' అంటూ హీరో కార్తికేయ చెప్పే డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
నాలుగు గోడల మధ్య ఊహించి రాసుకున్న కథతో ఈ చిత్రాన్ని తీయలేదు. విశాల ప్రపంచంలో జరిగిన యథార్థగాథ మా చిత్రానికి ముడి సరుకయ్యింది. స్క్రీన్ మీద కూడా అంతే సహజంగా ఉంటుంది. ఆ నేచురాలిటీ ప్రేక్షకుడి గుండెను తాకుతుందని దర్శకుడు తెలిపారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్, కెమెరామెన్: 'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ రామ్, ఆర్ట్ డైరెక్టర్ : జీయమ్ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : సత్య కిశోర్, శివ మల్లాల.


Click it and Unblock the Notifications











