ఆ సినిమా ధురంధర్‌ రేంజ్‌లో సక్సెస్‌ అవుతుందనుకున్నా.. స్టార్ డైరెక్టర్ ఎమోషనల్

టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్‌ (Gunasekhar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కడు', 'రుద్రమదేవి' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ఇలా వరుస విజయాలతో స్టార్‌గా గుర్తింపు పొందిన గుణశేఖర్.. ఇటీవల యుఫోరియా (Euphoria) అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామా అనే సినిమాతో ముందుకు వచ్చారు. అయితే.. ఈ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు. విడుదల తరువాత ఎదురైన పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?

యుఫోరియా (Euphoria) సినిమా ETV విన్‌లో ఏప్రిల్ 2 నుంచి స్ట్రీమింగ్ కానున్నది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. యుఫోరియా సినిమా ఆశించిన స్థాయిలో థియేటర్లలో ఆడకపోయినా, కంటెంట్ పరంగా మంచి స్పందన వచ్చిందని, అయితే బాక్సాఫీస్ వద్ద ఫలితం రాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని గుణశేఖర్ తెలిపారు.

Gunasekhar Emotional Thought Euphoria Would Match Dhurandhar Level Success

'ఈ సినిమా 'ధురంధర్' స్థాయి విజయాన్ని సాధిస్తుందని అనుకున్నాను. ఇది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. కానీ ప్రేక్షకులకు ఆ స్థాయిలో చేరలేకపోయింది' అని చెప్పారు. కథ, కంటెంట్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని, అయితే టైటిల్ కూడా ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోయిన కారణాల్లో ఒకటి’ అని అభిప్రాయపడ్డారు.

గుణశేఖర్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం ప్రేక్షకుల మైండ్‌సెట్ మారిపోయింది. పెద్ద సినిమాలను థియేటర్లలో చూసి, చిన్న సినిమాలను ఓటీలు చూసేద్దామనే ఆలోచన పెరిగింది. సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుందని భావించి, థియేటర్లకు రావడం తగ్గించారు' అని అన్నారు. ఈ సమస్యకు ఇండస్ట్రీ కూడా కొంతవరకు బాధ్యత వహించాల్సి ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇంకా, థియేట్రికల్ రిలీజ్ తర్వాత కనీసం మూడు నెలల గ్యాప్ ఇవ్వకపోవడం చిన్న సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. 'సినిమా విడుదలైన వెంటనే ఓటీటీలోకి వస్తే ప్రేక్షకుల థియేటర్లకు ఎందుకు వస్తారు? కనీసం మూడు నెలల గ్యాప్ తప్పనిసరి చేస్తే, కంటెంట్ ఉన్న సినిమాలకు థియేటర్లలో ఆదరణ పెరుగుతుంది' అని గుణశేఖర్ సూచించారు. ఇది కేవలం తన సినిమా కోసమే కాకుండా మొత్తం ఇండస్ట్రీ ప్రయోజనార్థం చెబుతున్నానని చెప్పారు.

'యుఫోరియా' సినిమా విడుదల సమయంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి ప్రారంభంలో మంచి తేదీ అనుకుని విడుదల చేసినప్పటికీ, సంక్రాంతి సమయంలో వచ్చిన భారీ చిత్రాల ప్రభావం ఇంకా కొనసాగడంతో ప్రేక్షకుల థియేటర్లకు రాలేదని పేర్కొన్నారు. 'ప్రేక్షకులు ఇప్పటికే పెద్ద సినిమాలు చూసి అలసిపోయారు. అలాంటి సమయంలో చిన్న సినిమాలు పెద్దగా పట్టించుకోలేదు' అని అన్నారు.

ఇక ప్రస్తుత ట్రెండ్‌పై కూడా గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్లైమాక్స్‌లో భారీ విజువల్స్, దేవుడి ఎలిమెంట్స్ చూపించి హిట్స్ సాధిస్తున్నారు. తనలాంటి దర్శకులను ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మహేష్ బాబు గురించి కూడా మాట్లాడారు. 'నేను అడగకపోయినా మహేష్ బాబు స్వయంగా సినిమా చూసి అభినందించారు. నేను పిలిస్తే సక్సెస్ మీట్‌కి కూడా వచ్చేవారు' అని అన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ గుణశేఖర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Read more about: gunasekhar Euphoria Dhurandhar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X