‘అల్లు అర్జున్ మూవీ డిజాస్టర్‌కు కారణం అదే.. అలా చేసి ఉంటే బ్లాక్‌బాస్టర్’

మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌ల తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వ్యక్తి అల్లు అర్జున్. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడిగ, చిరంజీవి మేనల్లుడిగా భారీ అంచనాల మధ్య బన్నీని లాంచ్ చేశారు. అందుకు తగినట్లుగానే డ్యాన్స్, ఫైట్స్, నటన, మేనరిజం ఇలా అన్నింటిలోనూ తనదైన ముద్ర వేశారు అల్లు అర్జున్. సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ లవర్ బాయ్‌గా, స్టైలీష్ స్టార్‌గా అభిమానులను సంపాదించుకున్న బన్నీ... ఇప్పుడు పాన్ ఇండియా హీరో. దేశంలోని బడ సూపర్‌స్టార్‌లలో ఒకడిగా, దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్స్‌లో ఒకరిగా నిలిచారు అల్లు అర్జున్.

బన్నీ కెరీర్‌లో డిజాస్టర్‌గా వరుడు
ఆయన కెరీర్‌‌లో ఎన్నో హిట్స్, ఎన్నో ఫ్లాప్స్ ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే వరుడు చిత్రం మరోకటి. బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అప్పట్లో ప్రచారం జరిగిన ఈ సినిమా.. ఆయన కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచింది. కమర్షియల్ సినిమా ఫార్మూలాకు దూరంగా భారతీయ వైవాహిక వ్యవస్థ, సంస్కృతి, ఐదు రోజుల పెళ్లి దాని చుట్టూ ఉండే బ్యాక్‌గ్రౌండ్‌ను ఇతివృత్తంగా తీసుకుని క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు.

Gunasekhar Reveals Shocking Truth Behind Allu Arjun s Varudu Disaster

వరుడు తారాగణం
యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను దాదాపు 30 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వరుడులో తమిళ హీరో ఆర్య విలన్‌గా నటించగా.. భానుశ్రీ మెహ్రా ఈ సినిమాతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సుహాసినీ, ఆశిష్ విద్యార్ధి, నరేష్, వినయా ప్రసాద్, కిశోరి భల్లాల్, నాజర్, బ్రహ్మానందం, షయాజీ షిండే, రావు, రమేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించారు. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా.. ఆంటోనీ ఎడిటర్‌గా వ్యవహరించగా.. మణిశర్మ సంగత దర్శకత్వం వహించారు. వేసవి కానుకగా 2010 మార్చి 31న వరుడు చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. అయితే తొలిరోజు నుంచి మిక్స్‌డ్ టాక్ కారణంగా వరుడు సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

ముగిసిపోయిన హీరోయిన్ కెరీర్
ఇక ఈ సినిమా ద్వారా తెలుగు తెరపై అడుగుపెట్టిన పంజాబీ ముద్దుగుమ్మ... భానుశ్రీ మెహ్రా కెరీర్‌పై వరుడు తీవ్ర ప్రభావం చూపించింది. దీనిపై ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ లాంటి స్టార్‌తో కలిసి పనిచేసినప్పటికీ తనకు అవకాశాలు రాలేదని.. కెరీర్‌లో ఎన్నో పరాజయాలు చవిచూశానని భానుశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల్లో నుంచి ఆనందాన్ని వెతుక్కోవడం అలవాటు చేసుకున్నానని భానుశ్రీ అన్నారు. కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు వరుడు సినిమా ఫ్లాప్ కావడానికి రకరకాల అంశాలు కారణమయ్యాయి. ఇందులో హీరోయిన్ ఎవరు? అనేది చివరి వరకు సస్పెన్స్‌లో పెట్టిన చిత్ర యూనిట్.. నేరుగా స్క్రీన్ మీద చూడాలని ప్రేక్షకులకు చెప్పారు. 5 రోజుల పెళ్లి గురించి కొత్త విషయాలు చెబుతారని, ఫ్యామిలీ డ్రామా ఉంటుందని వెళ్లిన ఆడియన్స్‌కు తెరపై విషయం మరోలా ఉండటంతో షాక్ అయ్యారు.

మధ్యలో కొందరు వేలుపెట్టి
తాజాగా వరుడు సినిమా డిజాస్టర్‌పై దర్శకుడు గుణశేఖర్ క్లారిటీ ఇచ్చారు ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ముందుగా మేం అనుకున్న దాని ప్రకారం 5 రోజుల పెళ్లి చుట్టూ సినిమా తీయాలని అనుకున్నా. అల్లు అర్జున్ కూడా ఈ కాన్సెప్ట్‌కు ఒప్పుకున్నారు. అయితే సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు జోక్యం చేసుకుని.. ఈ చిత్రాన్ని యాక్షన్ మూవీగా మార్చమని సూచించారు. ఇది నా అసలైన వరుడ స్క్రిప్ట్‌ని, ఐడియాలజీని పాడు చేసింది. వేటూరి గారు నాకు ఇచ్చిన పుస్తకం ఆధారంగా, నేను అనుకున్న విధంగా వరుడు సినిమాను తీసుకుంటే ఖచ్చితంగా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అయ్యేదని గుణశేఖర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వరుడు సినిమా స్క్రిప్ట్ విషయంలో వేలు పెట్టిన ఆ పెద్ద తలకాయలు ఎవరు? అంటూ అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: gunasekhar allu arjun varudu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X