Shaakuntalam హీరో సమంత కంటే అన్నేళ్లు చిన్నోడు.. ఈగ రిలీజైనప్పుడు ఏం చేసేవాడో తెలుసా?
వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది సమంత. ఫ్యామిలీ మ్యాన్ అనే హిందీ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ గతేడాది యశోద సినిమాతో మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా మూవీగా శాకుంతలంతో హిట్ అందుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ తన సినీ కెరీర్ లో ఇదివరకు తనకంటే వయసులో చిన్నవాళ్లైన హీరోలతో ఆడిపాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోతున్న శాకుంతలం మూవీ హీరో అయిన దేవ్ మోహన్ కూడా సమంత కంటే చాలా ఏళ్లు చిన్నోడు. ఆ వివరాల్లోకి వెళితే..

సిటాడెల్ హాలీవుడ్ మూవీ..
ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, పుష్ప మూవీలో ఊ అంటావా మావా ఐటమ్ సాంగ్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ముద్దుగుమ్మ సమంత. దీంతో ఆమెకు వరుస పెట్టి బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే యశోద సినిమాతో అలరించిన ఈ ఫిట్ నెస్ బ్యూటి తెలుగులో శాకుంతలం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఖుషీ సినిమాలో షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే హాలీవుడ్ లో సిటాడెల్ మూవీలో కూడా నటిస్తోంది.

ఎన్నోసార్లు వాయిదా..
ప్రస్తుతానికి శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది స్టార్ హీరోయిన్ సమంత. ఎపిక్ మైథాలాజికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఇప్పటికీ ఎన్నోసార్లు వాయిదా పడింది. ఫైనల్ గా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది సామ్ శాకుంతలం సినిమా. ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మించారు.

ఏప్రిల్ 14న..
అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన శాకుంతలం సినిమాలో దేవ్ మోహన్, మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల కీలక పాత్రల్లో మెరవనున్నారు. ఇందులో చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించింది. ఈ సినిమాతోనే అల్లు అర్హ తెలుగు చిత్రాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీని పాన్ ఇండియా చిత్రంగా ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఈగ సినిమాలో..
ఇదిలా ఉంటే శాకుంతలం సినిమాలో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. అయితే అతను సమంత కంటే వయసులో చిన్నోడు. ఈ విషయాన్ని ఇటీవల కేరళలోని కొచ్చిలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆసక్తికర నిజాన్ని పంచుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన గ్రాఫిక్స్ వండర్ ఈగ సినిమాలో సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా జులై 6న 2012లో విడుదలైంది.

చెవిలో చెప్పేసరికి..
అయితే ఈగ విడుదలైన సమయంలో తాను కాలేజీలో ఉన్నానని, అప్పుడు థియేటర్ లో సమంతను చూశానని హీరో దేవ్ మెహన్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. పక్కన కూర్చున్న సమంత చెవిలో ఏదో చెప్పేసరికి అప్పుడు అతని వయసు మాత్రం చెప్పలేదు. ఆ తర్వాత తాను ఓ కంపెనీలో పని చేసేటప్పుడు.. దానికి సమంత బ్రాండ్ అంబాసిడర్ అని, యాడ్ చేయడానికి వచ్చిన సామ్ ను నేరుగా చూశానని దేవ్ మోహన్ తెలిపారు.
సమంతకు 35 ఏళ్లు.. దేవ్ మోహన్ కు..
ఇప్పుడు ఏకంగా సమంతతో జోడీ కట్టే అవకాశం రావడం గురించి చెప్పుకొచ్చాడు దేవ్ మోహన్. ఇదిలా ఉంటే ఒక నటుడిగా సమంత కంటే దేవ్ మోహన్ జూనియర్. అలాగే వయసులో కూడా ఆమె కంటే చిన్నోడు. 1987 ఏప్రిల్ 28న జన్మించిన సమంత వయసు ఇప్పుడు 35 ఏళ్లు కాగా.. 1992 సెప్టెంబర్ 18న పుట్టిన దేవ్ మోహన్ ఏజ్ 30 సంవత్సరాలు. అంటే సమంత కంటే దేవ్ మోహన్ 5 ఏళ్లు చిన్నోడు. ఇంతకుముందు కూడా అల్లుడు శీను సినిమాలో తనకంటే ఐదేళ్లు చిన్నోడైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సామ్ జోడి కట్టిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











