Guntur Kaaram: మరోసారి కాపీ కొట్టాడు అంటూ థమన్ పై ట్రోల్స్.. హర్ట్ అయిన మహేష్ ఫ్యాన్స్
త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తోన్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్, మాస్ స్ట్రైక్ ని లాంచ్ చేశారు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా మాస్ స్ట్రైక్ ఉంది. మొదటిసారి మహేష్ బాబు కంప్లీట్ మాస్ రోల్ ని ఈ మూవీలో చేస్తూ ఉండటం విశేషం. అంతా బాగానే ఉంది కాని మొదట్లోనే ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ మళ్ళీ కాపీ ఆరోపణలు ఎదుర్కోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్ళకుండా:అతడు, ఖలేజా సినిమాలు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో గతంలో వచ్చాయి. అయితే ఈ రెండు థియేటర్స్ లో కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. దానికి కారణం మహేష్ తో మొదటిసారి త్రివిక్రమ్ అలాంటి ప్రయోగాలు చేయడమే అనే టాక్ ఉంది. అయితే ఈ సారి ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్ళకుండా పక్కా కమర్షియల్ స్టొరీని తీసుకొని చేస్తున్నారు.మహేష్ బాబుని కూడా ఫ్యాన్స్ కోరుకునే విధంగా మాస్ రోల్ లో చూపిస్తున్నారు.

థమన్ మీద మరోసారి కాపీ ఆరోపణలు: పోకిరి తర్వాత ఆ స్థాయిలో గుంటూరు కారం సినిమాలో మహేష్ క్యారెక్టర్ కి ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనికి కారణం మొదటిసారి పల్నాడు స్లాంగ్ లో ఈ గుంటూరు కారంలో మహేష్ బాబు మాట్లాడబోతున్నాడు. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇతని మీద కామన్ గా ఉండే కంప్లైంట్ కాపీ క్యాట్ అని. ఎక్కడో ఉన్న ట్యూన్స్ లేపేసి తన సినిమాలో సాంగ్స్ కోసం, బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం వాడేస్తూ ఉంటాడనే విమర్శలు నిత్యం వినిపిస్తూ ఉంటాయి.

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా కాపీ: దీనిపై సోషల్ మీడియాలో తమన్ మీద విపరీతమైన ట్రోలింగ్ కూడా జరుగుతుంది. తాజాగా లాంచ్ అయిన గుంటూరు కారం ఫస్ట్ స్ట్రైక్ కోసం వాడిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా కాపీ అనే విమర్శలు వస్తున్నాయి. ఈ సాంగ్ కోసం తమన్ ఏకంగా తన గత సినిమాల సాంగ్స్ నే మళ్ళీ కాపీ చేసి వాడేసాడంటూ ట్రోల్ చేస్తున్నారు. అల వైకుంఠపురంలో సిత్తరాల సిరపడు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని సన్నకర్ర బిట్ సాంగ్ కోసం కూడా వాడేశాడు అని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.

థమన్ పై ఫ్యాన్స్ అప్సెట్:అలాగే రామ్, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ స్ట్రైక్ కి ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి మ్యాచ్ అయ్యేలా గుంటూరు కారం స్ట్రైక్ ఉందని ఇక చాలా రకాల సినిమాల లోని మ్యూజిక్ మిక్స్ చేసి మహేష్ బాబుకి వాడేశాడు అంటూ మరో టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు కూడా తమన్ విషయంలో కాస్తా సీరియస్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల కోసం కరెక్ట్ గా మ్యూజిక్ ఇస్తూ మా హీరో మూవీకి కాపీ ట్యూన్స్ ఇస్తావా అంటూ ట్రోల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











