గుంటూరు కారం అసలు గొడవపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత టీమ్.. ఆ ఒక్క విషయంలో మాత్రం సస్పెన్స్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నెక్స్ట్ రాబోతున్న అతిపెద్ద సినిమాలలో గుంటూరు కారం కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు డిఫరెంట్ మాస్ లుక్ తో కనిపించబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ఈ సినిమా పై చాలా రకాల కన్ఫ్యూజన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఇక ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్, అలాగే హీరోయిన్ విషయంలో కూడా చిత్ర యూనిట్ సభ్యులు మరొక నిర్ణయానికి వచ్చినట్లు కూడా సోషల్ మీడియాలో ఒకటాక్ అయితే వైరల్ అవుతుంది. ఇక చిత్ర నిర్మాత టీం నుంచి ఈ వార్తలపై ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బిగ్ కాంబినేషన్:త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న 28వ సినిమా గుంటూరు కారం. ఈ కాంబినేషన్ కోసం ఫాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందే వీరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమా అంతగా సక్సెస్ కాలేదు. అందుకే ఈసారి గుంటూరు కారం సినిమాతో మహేష్ భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమా కోసం చాలా రోజులుగా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు.

మహేష్ బాబు సంతృప్తిగా లేడు అని..: ఇక గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ విషయాల నుంచి టెక్నీషియన్స్ వరకు అన్ని విషయాల్లో కూడా ఊహించని లీక్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విషయంలో మహేష్ బాబు సంతృప్తిగా లేడు అని అతను ఇచ్చిన ట్యూన్స్ త్రివిక్రమ్ కు నచ్చినప్పటికీ మహేష్ బాబుకు ఎంత మాత్రం నచ్చలేదని కథనాలు వెలువడుతున్నాయి. అతన్ని సినిమా నుంచి తొలగించి జీవి ప్రకాష్ కుమార్ లేదా అనిరుద్ ను సెలెక్ట్ చేసుకోవాలి అని మహేష్ నుంచి అభిప్రాయాలు వచ్చినట్లుగా కూడా ఒక టాక్ అయితే వినిపిస్తున్నాయి.

నిర్మాత టీమ్ క్లారిటీ: అంతేకాకుండా హీరోయిన్ విషయంలో కూడా చిత్ర యూనిట్ మరొక నిర్ణయం తీసుకుందని టాక్ రావడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. అయితే మొదట చిత్రం నిర్మాత యూనిట్ నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ముందుగా తమన్ విషయంలో అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదట. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు అని ప్రస్తుతం వర్క్ జరుగుతుంది అని తెలిపారు.

హీరోయిన్ విషయంలో సస్పెన్స్?: అయితే హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఆ విషయంలో కూడా వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలిసింది. ఇక ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ను ఈ నెల 24వ తేదీన మొదలుపెట్టబోతున్నారు. ఇక ముందుగా చెప్పినట్లుగానే సినిమాను 2024 సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. మహేష్ బాబు కూడా ఈ సినిమా కంటెంట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి


Click it and Unblock the Notifications











